ఏపీలోని.. స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణను అడ్డుకోవడంలో ప్రభుత్వం వైఫల్యం చెందిందని తెదేపా అధినేత చంద్రబాబు విమర్శించారు. వైఫల్యానికి నైతిక బాధ్యత వహిస్తూ సీఎం, ఎంపీలు తమ పదవులకు రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.
విశాఖ ఉక్కు ప్రైవేటీకరణకు సంబంధించిన పరిణామాలపై.. సీఎం జగన్ అబద్ధాలు చెబుతున్నారని చంద్రబాబు ఆరోపించారు. పోస్కో ప్రతినిధులతో మాట్లాడినా.. తాను మాట్లాడలేదంటూ ప్రజలను మభ్య పెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఇదీ చూడండి: పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓటు ఎలా వేయాలో తెలుసా...?