ఏపీలోని కర్నూలు జిల్లా రైతులు రోడ్డెక్కారు. టమాటలను రోడ్డుపై పడేసి నిరసన వ్యక్తం చేశారు. కనీసం రూపాయి కూడా ధర పలకడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.
దేవనకొండ మార్కెట్లో కిలో టమాట కనీసం రూపాయి ధర కూడా పలకటం లేదని వాపోయారు. దిక్కుతోచని పరిస్థితుల్లో కర్నూలు- బళ్లారి రహదారిపై టమాటాలను పారబోసి రైతులు వెళ్లిపోయారు.