ETV Bharat / city

రాజ్యాంగం ప్రకారం ఎవరి పరిధిలో వాళ్లుండాలి: ఏపీ సభాపతి - పరాకాష్ఠకు రాజకీయ వికృత చేష్టలు

ఏపీ శాసనసభాపతి తమ్మినేని సీతారాం న్యాయస్థానాలపై కీలక వ్యాఖ్యలు చేశారు. హైకోర్టు తీర్పుల తీరును ఆయన తప్పుబట్టారు. ఎన్నికలు, ప్రభుత్వాలు ఎందుకని ప్రశ్నించారు.

రాజ్యాంగం ప్రకారం ఎవరి పరిధిలో వాళ్లుండాలి: సభాపతి తమ్మినేని

author img

By

Published : Jul 2, 2020, 7:20 PM IST

Updated : Jul 2, 2020, 8:29 PM IST

చిత్తూరు జిల్లాలోని కాణిపాక వరసిద్ధి వినాయకుడిని దర్శించుకున్న ఏపీ సభాపతి తమ్మినేని సీతారాం... రాష్ట్రంలో నెలకొన్న రాజకీయ పరిస్థితులపై సంచలన వ్యాఖ్యలు చేశారు. గత 50 ఏళ్లలో ఎన్నడూ చూడని వింత పరిస్థితులు రాష్ట్రంలో నెలకొన్నాయన్నారు. ద్రవ్య వినిమయ బిల్లును అడ్డుకొని ఉద్యోగులకు జీతాలు రాకుండా చేయటమేంటని ఆశ్చర్యం వ్యక్తం చేశారు.

'రాజ్యాంగం కొన్ని హక్కులు, అధికారాలు, బాధ్యతలను ఇస్తూ కొన్ని హద్దులనూ నిర్ణయించింది. ఒకరి దాంట్లో మరొకరు జోక్యం చేసుకోకూడదు. కానీ ప్రస్తుతం జోక్యం చేసుకుంటున్నారు. కోర్టుల నుంచే ప్రభుత్వ విధానపరమైన ఆదేశాలు వస్తే ప్రజలు ఎందుకు? ఎన్నికలెందుకు? ప్రజా ప్రతినిధులెందుకు? శాసన సభ ఎందుకు? ముఖ్యమంత్రి ఎందుకు? ప్రత్యక్షంగా మీరే అక్కడి నుంచి పాలన చేస్తారా? ఇలాంటి పరిస్థితులను రాజ్యాంగ నిర్మాతలు ముందే ఊహించి ఉంటే కోర్టులకు కూడా ప్రత్యామ్నాయం ఆలోచించి ఉండేవారని నేను అనుకుంటున్నా' - శాసన సభాపతి తమ్మినేని సీతారాం

కాణిపాక ఆలయ అభివృద్ధికి ప్రభుత్వం తరఫున చర్యలు తీసుకుంటామని సభాపతి తమ్మినేని సీతారాం స్పష్టం చేశారు. త్వరలో ఆలయ అభివృద్ధి కార్యచరణ రూపొందిస్తామని వెల్లడించారు.

ఇదీ చదవండి: ఏబీ వెంకటేశ్వరరావు సస్పెన్షన్‌పై సుప్రీంకోర్టులో ఏపీ ప్రభుత్వం పిటిషన్

Last Updated : Jul 2, 2020, 8:29 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.