ETV Bharat / city

గవర్నర్‌గా తన అనుభవాలకు అక్షరరూపం ఇచ్చిన తమిళిసై

ఏడాది సమయంలో చేపట్టిన కార్యక్రమాలతో కూడిన 'మూవింగ్ ఫార్వార్డ్ విత్ మెమోరీస్ ఆఫ్ మేడిన్ ఈయర్​' అనే పుస్తకాన్ని గవర్నర్ తమిళిసై విడుదల చేశారు. ఏడాది కాలం పాటు చేపట్టిన కార్యక్రమాలను ఈ సందర్భంగా గవర్నర్ గుర్తుచేసుకున్నారు. త్వరలోనే గిరిజన ప్రాంతాల్లో పర్యటిస్తానని గవర్నర్​ వెల్లడించారు.

tamilisai inaugurated book of her experience as governor

author img

By

Published : Feb 12, 2021, 7:14 PM IST

రాజ్​భవన్ పాఠశాలలో విద్యార్థులకు అల్పాహారం అందిస్తున్న తరహాలో... గిరిజనులకు కూడా పోషకాహారం అందించాలనుకుంటున్నట్లు గవర్నర్ తమిళి సై సౌందరరాజన్ తెలిపారు. కొన్ని రోజులుగా... ఈ కార్యక్రమం అమలుపై ఆలోచన చేస్తున్నామని, వాహనాలను ఉపయోగించి మారుమూల ప్రాంతాల్లో అమలు చేసేందుకు యోచిస్తున్నట్లు వెల్లడించారు. ఏడాది పదవీ కాలం పూర్తి చేసుకున్న సందర్భంగా రాజ్​భవన్​లో మీడియాతో ఇష్టాగోష్ఠి నిర్వహించారు.

ఏడాది సమయంలో చేపట్టిన కార్యక్రమాలతో కూడిన 'మూవింగ్ ఫార్వార్డ్ విత్ మెమోరీస్ ఆఫ్ మేడిన్ ఈయర్​' అనే పుస్తకాన్ని గవర్నర్ విడుదల చేశారు. సంవత్సరం పాటు చేపట్టిన కార్యక్రమాలను ఈ సందర్భంగా గవర్నర్ గుర్తుచేసుకున్నారు. గవర్నర్​గా పదవీ చేపట్టినప్పుడు... బాధ్యతల నిర్వహణపై అనుమానాలు ఉండేవన్నారు. ఎన్నుకున్న ప్రభుత్వానికి, గవర్నర్ బాధ్యతలకు మధ్య తేడా ఉందన్న తమిళిసై... అంతిమంగా ప్రజలకు మేలు జరగటమే ధ్యేయం అన్నారు.

విద్యావ్యవస్థలో సమస్యలు ఉన్నాయని తమ దృష్టికి వచ్చిందని... మహమ్మారి సమయంలో యూనివర్సిటీ అధికారులతో సమావేశం నిర్వహించానని పేర్కొన్నారు. మహమ్మారి వల్ల వీసీల నియామకం జరగలేదని ప్రభుత్వం చెబుతోందని... ఒక నెలలో నియామకం చేస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చినట్లు వెల్లడించారు. గవర్నర్​గా సమస్యలు పరిష్కరించకపోయినప్పటికీ... ప్రభుత్వానికి నివేదించి వాటి పరిష్కరం కోసం పాటుపడుతున్నట్లు తెలిపారు. త్వరలోనే గిరిజన ప్రాంతాల్లో పర్యటిస్తానని గవర్నర్​ వెల్లడించారు.

ఇదీ చూడండి: నీటి విడుదలకు కృష్ణా నదీ నిర్వహణ బోర్డు ఉత్తర్వులు...

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.