పక్షం రోజుల్లో తెలుగు నేర్చుకొని రాష్ట్ర ప్రజలతో తెలుగులోనే మాట్లాడతానని గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ అన్నారు. రాజ్భవన్లో వివిధ విభాగాలను పరిశీలించిన ఆమె అధికారులు, సిబ్బందితో మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు. గవర్నర్గా నియామకం అయిన వెంటనే హైదరాబాద్ రావడానికి ముందే రాష్ట్ర సామాజిక, ఆర్థిక అంశాలను అధ్యయనం చేసినట్లు పేర్కొన్నారు. ఉద్యోగులతో తాను స్నేహపూర్వకంగా వ్యవహరిస్తానని.. ప్రతి ఒక్కరూ తమ విధులు సరిగ్గా నిర్వర్తించాలని గవర్నర్ స్పష్టం చేశారు. రాజ్భవన్లో ఉన్న గ్రంథాలయాన్ని సందర్శించిన తమిళిసై పుస్తకాలు బాగా సేకరించారని అధికారులను అభినందించారు. తన వ్యక్తిగత గ్రంథాలయంలో ఉన్న 5వేల పుస్తకాలను ఇక్కడకు తీసుకురానున్నట్లు తెలిపారు.
ఇవీ చూడండి: కాళేశ్వరం... రాష్ట్రానికి మణిహారం: గవర్నర్ తమిళిసై