తలసాని సాయి కిరణ్ ఎన్నికల ప్రచారం సమాఖ్య కూటమి అధికారంలోకి వస్తేనే రాష్ట్రాలు అభివృద్ధి పథంలో దూసుకుపోతాయని సికింద్రాబాద్ తెరాస ఎంపీ అభ్యర్థి తలసాని సాయికిరణ్ అన్నారు. రాష్ట్రంలో 16 ఎంపీ సీట్లు గెలిచి భాజపా, కాంగ్రెసేతర పార్టీలను కలుపుకుని ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటు చేయడం ఖాయమన్నారు. నియోజకవర్గ పరిధిలోని మెట్టుగూడ, దూద్‌బావి ప్రాంతాల్లో తలసాని సాయి కిరణ్ యాదవ్, డిప్యూటీ స్పీకర్ పద్మారావు ఇంటింటి ప్రచారం చేశారు. కార్యక్రమంలో తెరాస నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. మైనార్టీ సోదరులకు అండగా ఉంటామని హామీ ఇచ్చారు.
ఇవీ చూడండి:నాయకత్వం బలంగా ఉంటేనే ఫలితాలు బాగుంటాయి