కొత్తగా ఎన్నికైన హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్‌నగర్ పట్టభద్రుల తెరాస ఎమ్మెల్సీ సురభి వాణిదేవి కారు ప్రమాదానికి గురైంది. గురువారం ఉదయం ఆమె శాసన మండలికి వస్తుండగా అసెంబ్లీ ప్రాంగణంలోని రైల్వే కౌంటర్ వద్ద కారు అదుపుతప్పి గేటును ఢీకొట్టింది. ఈఘటనలో కారు ముందు భాగం ధ్వంసమైంది. ప్రమాదం జరిగిన సమయంలో వాణిదేవి గన్‌మెన్ కారును నడిపారు.
కారు నడిపి ప్రమాదానికి కారణమైన వ్యక్తిగత భద్రతా అధికారి (పీఎస్‌వో)పై సీపీ చర్యలు తీసుకున్నారు. పీఎస్‌వో భానుప్రకాశ్‌ను సీపీ అంజనీకుమార్ సస్పెండ్ చేశారు.
ఇవీ చూడండి: నామినేషన్లకు వరుస సెలవులతో అభ్యర్థుల్లో అయోమయం