పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో అవినీతిపై సుప్రీం కోర్టు విచారణ చేపట్టింది. మాజీ మంత్రి నాగం జనార్దన్‌రెడ్డి దాఖలు చేసిన ప్రజాప్రయోజన వ్యాజ్యంపై అత్యున్నత న్యాయస్థానం విచారించింది. ఆదాయపన్ను శాఖ ఇటీవల పలు చోట్ల నిర్మాణ సంస్థలపై దాడులు చేసిన విషయాన్ని పిటిషనర్ తరపు న్యాయవాది ప్రశాంత్ భూషణ్ కోర్టుకు తెలిపారు.
అవకతవకలు జరిగాయి: నాగం జనార్దన్‌రెడ్డి
ఎత్తిపోతల పథకంలో అవకతవకలు జరిగాయని...దీనిపై విచారణ జరపాలని నాగం కోరారు. ఇటీవల దాడులు చేసిన ఆదాయపన్ను శాఖను కూడా దీనిలో రెస్పాన్డెంట్గా చేర్చాలని ప్రశాంత్‌భూషణ్ కోర్టుకు విన్నవించారు.
నాలుగు వారాలకు వాయిదా
అవినీతి ఆరోపణలను తెలంగాణ సర్కారు తరఫు న్యాయవాదులు తోసిపుచ్చారు. ఇరువురి వాదనలు విన్న ధర్మాసనం... రెండు వారాల్లో కౌంటర్ దాఖలు చేయాలని తెలంగాణ ప్రభుత్వాన్ని.. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బాబ్డే నేతృత్వంలోని ధర్మాసనం ఆదేశించింది. సుప్రీంకోర్టు విచారణను నాలుగు వారాలకు వాయిదా వేసింది.
ఇవీ చూడండి: 'పోలవరంపై సందేహాలు నివృత్తి చేయాల్సింది ఏపీనే'