ETV Bharat / city

తెలుగు రాష్ట్రాల్లో అసెంబ్లీ నియోజకవర్గాల పెంపుపై కేంద్రానికి నోటీసులు - అసెంబ్లీ నియోజకవర్గాల పెంపుపై కేంద్రానికి నోటీసులు

Supreme Court
Supreme Court
author img

By

Published : Oct 13, 2022, 2:27 PM IST

Updated : Oct 13, 2022, 3:01 PM IST

14:24 October 13

అసెంబ్లీ నియోజకవర్గాల పునర్విభజనపై దాఖలైన పిటిషన్ల విచారణ వాయిదా

Assembly Seats Increase in Telangana : అసెంబ్లీ నియోజకవర్గాల పునర్విభజనపై సుప్రీంకోర్టులో దాఖలైన పిటిషన్ల విచారణ వాయిదా పడింది. ఏపీ, తెలంగాణ, జమ్ముకశ్మీర్‌లో సీట్ల పెంపుపై దాఖలైన పిటిషన్లపై ఇవాళ ధర్మాసనం విచారణ చేపట్టింది. పిటిషన్లపై స్పందించేందుకు సమయం ఇవ్వాలని సొలిసిటర్ జనరల్ సర్వోన్నత న్యాయస్థానాన్ని కోరారు. 4 వారాల్లో కౌంటర్ దాఖలు చేయాలని ధర్మాసనం.. కేంద్రాన్ని ఆదేశించింది. జమ్ముకశ్మీర్‌లో అసెంబ్లీ సీట్ల వ్యవహారంపై విచారణ చేపడతామని తెలిపింది. నవంబర్ 16, 17 తేదీల్లో విచారణ జరుపుతామని జస్టిస్ కిషన్‌కౌల్ ధర్మాసనం పేర్కొంది. తెలంగాణ, ఏపీలో సీట్ల పెంపుపై సుప్రీంకోర్టు కేంద్రానికి నోటీసులు జారీ చేసింది.

అంతకుముందు గత నెలలో ఏపీ అసెంబ్లీ సీట్లను 175 నుంచి 225కు, తెలంగాణ అసెంబ్లీ సీట్లను 119 నుంచి 153కు పెంచాలని పిటిషన్ దాఖలు అయింది. విభజన చట్టం నిబంధనలు అమలుచేసేలా కేంద్రాన్ని ఆదేశించాలని పిటిషన్​లో పేర్కొన్నారు. పర్యావరణ నిపుణుడు ప్రొఫెసర్ కె. పురుషోత్తం రెడ్డి సుప్రీంకోర్టులో ఈ పిటిషన్‌ దాఖలు చేశారు.

తెలంగాణ, ఏపీ, కేంద్రం, ఈసీని ప్రతివాదులుగా చేర్చారు. విచారణ చేపట్టిన సర్వోన్నత న్యాయస్థానం.. ప్రతివాదులకు నోటీసులు జారీ చేసింది. జమ్ముకశ్మీర్‌ నియోజకవర్గాల పిటిషన్‌కు జతచేయాలని రిజిస్ట్రీకి ఆదేశించింది. సుప్రీంకోర్టు రిజిస్ట్రీకి జస్టిస్‌ జోసఫ్‌, జస్టిస్‌ హృషికేశ్‌ రాయ్‌ ధర్మాసనం ఈ ఆదేశం పంపింది.

ఇవీ చదవండి:

Last Updated : Oct 13, 2022, 3:01 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.