ETV Bharat / city

పాలనా వికేంద్రీకరణ, సీఆర్డీఏ రద్దు చట్టాలపై విచారణ వాయిదా - సీఆర్డీఏ రద్దు చట్టాలు వార్తలు

ఏపీ ప్రభుత్వం పాలనా వికేంద్రీకరణ, సీఆర్డీఏ రద్దు చట్టాలపై సుప్రీంకోర్టులో విచారణ వాయిదా పడింది. ఏపీ దాఖలు చేసిన పిటిషన్‌ను మరో బెంచ్‌కి పంపాలని జస్టిస్ ఆర్‌.ఎఫ్‌.నారీమన్ నేతృత్వంలోని ముగ్గురు సభ్యుల సుప్రీంకోర్టు ధర్మాసనం సూచించింది

SUPREME COURT ADJOURNED AP CAPITAL PETITION
పాలనా వికేంద్రీకరణ, సీఆర్డీఏ రద్దు చట్టాలపై సుప్రీం విచారణ వాయిదా
author img

By

Published : Aug 19, 2020, 5:30 PM IST

పాలనా వికేంద్రీకరణ, సీఆర్డీఏ రద్దు చట్టాలపై సుప్రీంకోర్టులో విచారణ వాయిదా పడింది. ఏపీ దాఖలు చేసిన పిటిషన్‌ను మరో బెంచ్‌కి పంపాలని జస్టిస్ ఆర్‌.ఎఫ్‌.నారీమన్ నేతృత్వంలోని ముగ్గురు సభ్యుల సుప్రీంకోర్టు ధర్మాసనం సూచించింది. హైకోర్టు ఇచ్చిన స్టేటస్ కోను ఎత్తివేయాలని ఏపీ ప్రభుత్వం పిటిషన్ వేయగా.. తాజాగా ధర్మాసనం ఈ తీర్పునిచ్చింది. ఈ కేసు సోమవారం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బాబ్డే ధర్మాసనం ముందుకు రాగా... సీజేఐ మరో ధర్మాసనానికి బదిలీ చేసిన విషయం విదితమే.

రాజధాని పిటిషన్‌లో అమరావతి ఐకాస, రైతులు కేవియట్ దాఖలు చేశారు. కేవియట్ పిటిషన్‌దారులకు కాపీని పంపినట్లు ఇదివరకే ఏపీ ప్రభుత్వం కోర్టుకు తెలిపింది. అమరావతి ఇళ్ల స్థలాల పంపిణీ, ఆర్ 5 జోన్ ఏర్పాటుపై హైకోర్టు ఆదేశాలను ఏపీ ప్రభుత్వం సవాల్ చేసింది.

ఇదీ చూడండి. 8 పెట్టెల్లో 2.4 కిలోల బంగారం, 84 కిలోల వెండి, రూ.15.55 లక్షలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.