ETV Bharat / city

రైల్వే బోర్డు కొత్త రథసారథిగా సునీత్ శర్మ - రైల్వే బోర్డు తాజా వార్తలు

రైల్వే బోర్డుకు సునీత్ శర్మను కొత్త ఛైర్మన్​గా‌ కేంద్రం నియమించింది. తూర్పు రైల్వే జనరల్‌ మేనేజర్​గా పని చేస్తున్న‌ సునీత్ ‌శర్మ బోర్డు నూతన ఛైర్మన్‌, సీఈవోగా ఎంపికయ్యారు.

suneet-sharma-as-the-new-chairman-of-the-railway-board
రైల్వే బోర్డు కొత్త రథసారథిగా సునీత్ శర్మ
author img

By

Published : Jan 1, 2021, 2:42 PM IST

రైల్వే బోర్డుకు కేంద్రం కొత్త ఛైర్మన్‌ను నియమించింది. తూర్పు రైల్వే జనరల్‌ మేనేజర్‌ సునీత్ ‌శర్మను రైల్వే బోర్డు నూతన ఛైర్మన్‌, సీఈవోగా ఎంపికచేసింది. ప్రస్తుతం ఛైర్మన్‌గా కొనసాగుతున్న వినోద్‌ కుమార్‌ యాదవ్‌ పదవీ కాలం ముగియడం కారణంగా ఆ బాధ్యతలను సునీత్‌కు అప్పగించారు. సునీత్‌ శర్మ 1978 బ్యాచ్‌కు చెందిన స్పెషల్‌ క్లాస్‌ రైల్వే అప్రెంటిస్‌ అధికారి.

34 ఏళ్లకు పైగా..

భారతీయ రైల్వే సంస్థలో ఆయన దాదాపు 34ఏళ్లకు పైగా వివిధ హోదాల్లో పనిచేశారు. సాంకేతిక అంశాలపై ఆయనకు మంచి అవగాహన ఉండటంతో పాటు పనిచేసిన విభాగాల్లో కొన్ని పాలనాపరమైన సంస్కరణలు తీసుకొచ్చిన వ్యక్తిగా ఆయనకు పేరుంది.

కోచ్‌ ఫ్యాక్టరీకి జీఎంగా సేవలు..

రాయ్‌బరేలీలోని మోడర్న్‌ కోచ్‌ ఫ్యాక్టరీకి జనరల్‌ మేనేజర్‌గానూ సేవలందించారు. అంతేకాకుండా సెంట్రల్‌ రైల్వేలో పుణె డీఆర్‌ఎంగా, చీఫ్‌ మెకానికల్‌ ఇంజినీర్‌గా, వారణాసిలోని డీజిల్‌ లోకోమెటివ్‌ వర్క్స్‌లో ప్రిన్సిపల్‌ చీఫ్‌ మెకానికల్‌ ఇంజినీర్‌గా పనిచేశారు. విదేశాల్లో జరిగిన పలు రైల్వే సంస్థల శిక్షణా కార్యక్రమాలకూ ఆయన హాజరయ్యారు.

ఇవీ చూడండి : 2021కి భారత్ ఘన స్వాగతం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.