ETV Bharat / city

బ్రహ్మంగారి మఠం పీఠాధిపత్యంపై కొలిక్కి వచ్చిన చర్చలు - కడప జిల్లా తాజా వార్తలు

కాలజ్ఞాన సృష్టికర్త శ్రీమద్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి జీవసమాధి అయిన బ్రహ్మంగారి మఠంలో …పీఠాధిపత్యం కోసం జరిగిన చర్చలు కొలిక్కి వచ్చాయి. 11వ పీఠాధిపతి వీరబోగ వసంత వెంకటేశ్వరస్వామి శివైక్యం తర్వాత....పీఠాధిపతి ఎవరనే అంశంపై కుటుంబీకుల మధ్య వివాదం తలెత్తింది. ఈ అంశంపై శైవక్షేత్ర మఠాధిపతులు రెండ్రోజులుగా చర్చలు జరిపారు. ఈనెల 10వ తేదీలోగా పీఠాధిపతిని ఏపీ ప్రభుత్వం నిర్ణయిస్తుందని మఠాధిపతులు స్పష్టం చేశారు.

Brahmamgari Matam
బ్రహ్మంగారి మఠం పీఠాధిపత్యంపై కొలిక్కి వచ్చిన చర్చలు
author img

By

Published : Jun 4, 2021, 10:52 AM IST

బ్రహ్మంగారి మఠం పీఠాధిపతి ఎవరనే అంశంపై గత 10 రోజులుగా జరుగుతున్న వివాదం ఎట్టకేలకు కొలిక్కి వచ్చింది. గత నెల 8న 11వ పీఠాధిపతి వీరబోగ వసంత వెంకటేశ్వరస్వామి శివైక్యం పొందారు. ఆయన తర్వాత 12వ పీఠాధిపతి ఎవరనే అంశంపై.. ఆయన ఇద్దరు భార్యల కుమారుల మధ్య వివాదం నడుస్తోంది. దీన్ని పరిష్కరించేందుకు ప్రభుత్వ ఆదేశాల మేరకు 2 తెలుగు రాష్ట్రాలకు చెందిన 12 మంది పీఠాధిపతులు బ్రహ్మంగారి మఠానికి విచ్చేశారు. విశ్వధర్మ పరిరక్షణ వేదిక అధ్యక్షులు శివస్వామి ఆధ్వర్యంలో బుధ, గురువారాలు మఠంలో మకాం వేసి చర్చలు జరిపారు.

దివంగత పీఠాధిపతి వెంకటేశ్వరస్వామి పెద్ద భార్య చంద్రావతమ్మ నలుగురు కుమారులతో పాటు.. రెండో భార్య మారుతీ మహాలక్ష్మమ్మ, ఆమె ఇద్దరు కుమారులతో స్వామీజీలు చర్చలు జరిపారు. మఠానికున్న ప్రాముఖ్యత, వారసత్వంగా సంక్రమించే పీఠాధిపత్యం అర్హతలను స్వామీజీలు 2 కుటుంబాలకు వివరించారు. వీటితో పాటు ప్రముఖ ఆధ్యాత్మిక వేత్తల అభిప్రాయాలు, గ్రామస్థుల వినతులను స్వీకరించారు. ఈనెల పదో తేదీలోగా యోగ్యుడైన వ్యక్తి పీఠాధిపతిగా ఎంపికవుతారని విశ్వధర్మ పరిరక్షణ వేదిక అధ్యక్షులు శివస్వామి ఆశాభావం వ్యక్తం చేశారు.

పవిత్రమైన బ్రహ్మంగారిమఠంలో వారసత్వ పీఠం కోసం గొడవలు పెంచుకోవడం మంచిది కాదని వెంకటేశ్వరస్వామి కుటుంబీకులకు పీఠాధిపతులు హితవు పలికారు. 2 కుటుంబాల వద్ద నున్న 2 వీలునామాలు, ఓ అగ్రిమెంటును పరిశీలించారు. సాంప్రదాయం ప్రకారం పీఠాధిపత్యం పొందడానికి ఎలాంటి వీలునామాలు చెల్లవని శివస్వామీ తేల్చి చెప్పారు. ఆస్తి పంపకాల కోసమే అవి పనికి వస్తాయన్నారు. పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి కాలం నుంచి పీఠాధిపత్యం ఎలా సంక్రమిస్తోందనే అంశంపై చర్చించారు. స్వామివారి కల్యాణం సందర్భంగా తప్పనిసరిగా పీఠాధిపతి దంపతులు ఆశీనులు కావాలని చెప్పారు. ఆ లెక్కన చూస్తే రెండో భార్య మారుతి మహాలక్ష్మమ్మ కుమారులు మైనర్లు. వారు పీఠాధిపత్యం ఎలా చేస్తారనే సందేహాన్ని స్వామీజీలు వ్యక్తం చేశారు. పుణ్యక్షేత్రం పవిత్రతను కాపాడాలంటే ఎవరూ కోర్టు మెట్లు ఎక్కవద్దని స్వామీజీలు సలహా ఇచ్చారు. బ్రహ్మంగారి మఠానికున్న విశిష్టత దృష్ట్యా... ఏపీ ప్రభుత్వం వెంటనే దేవాదాయశాఖ తరపున ఉన్నతాధికారిని నియమించాలని విజ్ఞప్తి చేశారు. 2 రోజుల్లో చర్చించిన అన్ని విషయాలపై ప్రభుత్వానికి నివేదిక అందిస్తామన్నారు.

పీఠాధిపతుల నిర్ణయంతో 10 రోజుల నుంచి బ్రహ్మంగారి మఠంలో రెండు కుటుంబాల మధ్య నెలకొన్న వివాదానికి తాత్కాలికంగా తెరపడినట్లేనని స్థానికులు భావిస్తున్నారు.

ఇవీచూడండి: Brahmangari Math: బ్రహ్మంగారి మఠానికి.. తదుపరి పీఠాధిపతి ఎవరు?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.