Students Suspended in Ragging Case at JNTUK: ఆంధ్రప్రదేశ్‌లోని జేఎన్టీయూ కాకినాడలో ర్యాగింగ్ కలకలం రేపింది. ర్యాగింగ్‌కు పాల్పడిన 11 మంది విద్యార్థులపై సస్పెన్షన్ వేటు పడింది. సదరు విద్యార్థులను 14 రోజుల పాటు తరగతులు, రెండు నెలల పాటు వసతిగృహం నుంచి సస్పెండ్ చేసినట్లు యూనివర్సిటీ ఉపకులపతి ప్రసాదరాజు తెలిపారు.
మొదటి సంవత్సరం ఇంజినీరింగ్ విద్యార్థిని ఇంటరాక్షన్ పేరిట ర్యాగింగ్ చేసినట్టు యూజీసీ యాంటీ ర్యాగింగ్ వెబ్‌సైట్‌కు ఫిర్యాదు వచ్చింది. ఫిర్యాదుపై విశ్వవిద్యాలయం యాంటీ ర్యాగింగ్ కమిటీ విచారణ చేపట్టింది. కమిటీ నివేదిక ఆధారంగా ఇద్దరు మొదటి ఏడాది, 9 మంది తృతీయ సంవత్సరం విద్యార్థులను రెండు వారాలపాటు సస్పెండ్ చేసినట్టు ఉపకులపతి ప్రసాదరాజు వెల్లడించారు.
ఇదీ చదవండి:
రాష్ట్ర వైద్యారోగ్యరంగం దేశానికే ఆదర్శంగా మారుతోంది: హరీశ్‌రావు
మార్నింగ్ వాక్ చేస్తుండగా ఢీకొట్టిన బొలెరో.. పక్కకు తప్పుకునే ప్రయత్నం చేసినా..