హైదరాబాద్‌లోని యూనివర్సిటీలల్లో పౌరసత్వ సవరణ చట్టాన్ని నిరసిస్తూ ఆందోళనలు మిన్నంటాయి.‘మను’ విద్యార్థులు పెద్దఎత్తున వర్సిటీ ప్రధానద్వారం వద్ద ఆందోళనకు దిగారు. దిల్లీలోని జేఎంఐ విద్యార్థులపై పోలీసుల లాఠీఛార్జిని ఖండించారు. కేంద్రానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
విద్యార్థులపై లాఠీఛార్జి దారుణం
పౌరసత్వ సవరణ చట్టాన్ని నిరసిస్తూ హైదరాబాద్‌లోని మౌలానా ఆజాద్ నేషనల్ ఉర్దూ విశ్వవిద్యాలయం (మను), కేంద్రీయ విశ్వవిద్యాలయంలోనూ ఆందోళనలు జరిగాయి. ఆదివారం రాత్రి ‘మను’ విద్యార్థులు పెద్దఎత్తున వర్సిటీ ప్రధానద్వారం వద్దకు చేరుకుని నినాదాలు చేశారు. దిల్లీలోని జామియా మిలియా ఇస్లామియా (జేఎంఐ) విశ్వవిద్యాలయం విద్యార్థులపై పోలీసుల లాఠీఛార్జిని ఖండించారు. కేంద్రానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
కేంద్ర హోం మంత్రి దిష్టిబొమ్మ దహనం
సుమారు 60 మంది అర్ధరాత్రి సమయంలోనూ ప్రవేశద్వారం వద్ద బైఠాయించి డప్పులు వాయిస్తూ ఆందోళనను కొనసాగించారు. హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయంలో స్టూడెంట్ ఇస్లామిక్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో రాత్రి 11.30 గంటల ప్రాంతంలో కేంద్ర హోం మంత్రి అమిత్‌షా దిష్టిబొమ్మను దహనం చేసి నిరసన వ్యక్తం చేశారు. దిల్లీలోని జామియా మిలియా ఇస్లామియా విద్యార్థులకు హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ సంఘీభావం ప్రకటించారు.