Students clash in Vijayawada: ఓ కళాశాల విద్యార్థినులు నడి రోడ్డుపై బాహాబాహీకి దిగారు. ఒకరిపై ఒకరు పిడిగుద్దులు కురిపించుకుంటూ.. జుట్లు పట్టుకుని మరీ ఘర్షణకు దిగారు. తగ్గేదేలే అంటూ తమ బలాన్ని ప్రదర్శించారు. ఆడవాళ్లు ఇలా గొడవపడటం కామన్ కానీ.. చదువుకునే అమ్మాయిలు ఇలా కొట్టుకుంటున్నారేంటి అక్కడున్న వాళ్లు నోరెళ్లబెట్టి చూస్తున్నారు. ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడ వన్‌టౌన్ కేబీఎన్ కళాశాల సమీపంలో ఈ సన్నివేశం కెమెరా కంటపడింది.
కళాశాల తరగతి గదిలో ఏమైందో ఏమో కానీ... కాలేజీ వదిలిన వెంటనే బయటికి వచ్చిన విద్యార్థినులు ఒకరిపై ఒకరు పిడిగుద్దులతో ముష్టి యుద్ధానికి దిగారు. ఇప్పటి వరకు విద్యార్థులు వీధి పోరాటాలకు దిగటం అందరూ చూశారు. కానీ... ఇలా విద్యార్థినులు వీధిపోరాటాలు, ముష్టి యుద్ధాలు చేసుకోవడం చూసి స్థానికులు ఒక్కసారిగా అవాక్కయ్యారు. విద్యార్థినులు కొట్టుకున్న వీడియోలు ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో హల్చల్ చేస్తున్నాయి.
ఇవీ చదవండి: బోల్తాపడిన కోడిగుడ్ల వాహనం.. ఎత్తుకెళ్లేందుకు ఎగబడిన జనం