సమాజంలో ఆడపిల్లంటే ఆటవస్తువుగా మారిందని ఎస్ఎఫ్ఐ విద్యార్థులు ఆరోపించారు. మద్రాసు యూనివర్సిటీలో చేరిన మూడు నెలలకే ఐఐటి చదువుతున్న ఫాతిమా లతీఫ్ బలవన్మరణానికి పాల్పడిందని తెలిపారు. విద్యార్థిని మృతికి కారకులైన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ.. ఎస్ఎఫ్ఐ విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో ఓయూ విద్యార్థులు ర్యాలీ నిర్వహించారు. ఆర్ట్స్ కాలేజ్ ప్రాంగణం ఎదుట మానవహారం నిర్వహించారు.
వర్సిటీ అడ్మినిస్ట్రేషన్ విభాగానికి చెందిన అధికారుల వేధింపుల వల్లే ఆత్మహత్యకు పాల్పడిందని... సూసైడ్ లెటర్లో పేర్కొన్న ముగ్గురు ప్రొఫెసర్లపై కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేశారు.
ఇదీ చదవండి: కిడ్నాప్ కేస్ - నాన్న ఫోన్ నెంబర్ గుర్తుంది.. కాల్ చేశా..!