TTD on Tickets rates: తిరుమల శ్రీవారి ఆర్జిత సేవలు, దర్శనాల టికెట్ల ధరలు పెంచే ఆలోచనే లేదని తితిదే ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి స్పష్టం చేశారు. గత సమావేశంలో ధరలు పెంచే అంశంపై చర్చ మాత్రమే జరిగిందన్నారు. వీలైనంత త్వరగా ఏప్రిల్ మొదటి వారంలో ఆర్జిత సేవలు ప్రారంభించేలా చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు.
మరో 2 ప్రాంతాల్లో అన్నప్రసాద పంపిణీకి ఏర్పాట్లు చేస్తున్నామని వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. రెండేళ్ల తర్వాత తిరుమలలో సాధారణ పరిస్థితులు వస్తాయని పేర్కొన్నారు. భక్తుల భద్రత కోసం 3 వేల సీసీ కెమెరాలు తిరుమలలో ఏర్పాటు చేశామని వెల్లడించారు.
ఇదీ చదవండి: yadadri brahmotsavam 2022 : అట్టహాసంగా యాదాద్రీశుడి బ్రహ్మోత్సవం