ETV Bharat / city

'దేవాలయ భూముల్లో సాగు చేస్తే దేవుడికీ ఆధార్​ ఇవ్వాలా..!' - పెదకళ్లేపల్లి రైతుల ధర్నా న్యూస్

అప్పుల్లేవనే పత్రాలూ ఇవ్వకుంటే బ్యాంకర్లు రుణాలివ్వమంటున్నారని ఏపీలో కౌలు రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దేవాలయ భూములు సాగు చేసే వారికి పంట రుణాలు అందక ఇబ్బందులు పడుతున్నారని ఆంధ్రప్రదేశ్ కౌలు రైతుల సంఘం పేర్కొంది. కృష్ణా జిల్లా పెదకళ్లేపల్లిలో 120 మంది కౌలు రైతులుంటే ఒక్కరికీ పంట రుణాలు ఇవ్వలేదని వాపోయారు.

state-tenant-farmers-association-agitaion-in-krishna-district
'దేవాలయ భూముల్లో సాగు చేస్తే దేవుడికీ ఆధార్​ ఇవ్వాలా..!'
author img

By

Published : Jan 30, 2020, 10:42 AM IST

‘దేవుడికీ ఆధార్‌ ఇవ్వాలి. స్వామికి అప్పుల్లేవనే పత్రాలూ మంజూరు చేయాలి. అలాగైతేనే తమకు పంట రుణాలిస్తామంటున్నారని కౌలు రైతులు మొరపెట్టుకుంటున్నారని’ ఏపీ రాష్ట్ర కౌలు రైతుల సంఘం పేర్కొంది. దేవాలయ భూములు సాగు చేసే వారికి పంట రుణాలు ఇవ్వడం లేదని గుర్తుచేసింది. రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల సమితి కార్యాలయంలో వ్యవసాయ శాఖ కమిషనర్‌ అరుణ్‌కుమార్‌, ఎస్‌ఎల్‌బీసీ ఏజీఎం కె.అజయ్‌పాల్‌ను కలిసి దేవాలయ భూములు సాగు చేసే కౌలు రైతులకు పంట రుణాలు మంజూరు చేయాలని వినతిపత్రం ఇచ్చినట్లు సంఘ కార్యదర్శి పి.జమలయ్య, టి.రామారావు వివరించారు.

ఆ కౌలు రైతులకు పంట సాగుదారు హక్కుల కార్డులు ఇవ్వాలంటే.. యజమాని ఆధార్‌ కార్డులివ్వమని రెవెన్యూ అధికారులు అడుగుతున్నారన్నారు. ఆ భూములకు యజమాని దేవుడేనని, ఆయన పేరుతో ఆధార్‌ ఎక్కడ్నుంచి తేవాలని ప్రశ్నించారు. దేవాలయ అధికారుల సంతకాలతో కొన్నిచోట్ల పంటదారు సాగు పత్రాలు తీసుకున్నా.. దేవుని పేరుతో అప్పు లేదని ధ్రువీకరించే పత్రాలు తేవాలని బ్యాంకర్లు చెబుతున్నారని వివరించారు.

కృష్ణా జిల్లా మోపిదేవి మండలం పెదకళ్లేపల్లిలో 120 మంది కౌలు రైతులుంటే ఒక్కరికీ పంట రుణాలు ఇవ్వలేదని వారు తెలిపారు. దేవాలయ భూముల్ని సాగు చేసుకుంటున్న కౌలు రైతులకు.. కౌలు రశీదు ఆధారంగా పంట రుణాలు ఇప్పించాలని కోరారు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.