కేంద్ర విదేశాంగశాఖ మంత్రి జయశంకర్‌కు రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్ కుమార్ లేఖ రాశారు. దోహ, ఖతర్ దేశాల నుంచి హైదరాబాద్‌కు విమానాల సంఖ్యను పెంచాలని కోరారు.
దోహ, ఖతర్‌లో ఉంటున్న సుమారు 70 వేల మంది తెలంగాణ వాసులు స్వస్థలాలకు రాలేక ఇబ్బంది పడుతున్నారని.. అక్కడి తెలంగాణ జాగృతి ప్రతినిధులు వినోద్ కుమార్‌కు లేఖ రాశారు. ఇప్పటికే 3,500 మంది భారత ఎంబసీలో పేర్లు నమోదు చేయించుకున్నారని వివరించారు. ప్రస్తుతం ఆయా దేశాల నుంచి ఒకే విమానం నడుస్తోందని.. అందులో 183 మంది ప్రయాణికులు మాత్రమే ప్రయాణించే అవకాశం ఉంటోందన్నారు. పలువురు ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నారని వినోద్ దృష్టికి తీసుకువచ్చారు. మరికొందరి వీసా గడువు ముగిసిందన్నారు.
స్పందించిన వినోద్ కుమార్.. గల్ఫ్ దేశాల్లో ఉన్న తెలంగాణ వాసుల్ని స్వస్థలాలకు చేర్చేలా చర్యలు తీసుకోవాలని కేంద్ర విదేశాంగ మంత్రికి లేఖ రాశారు.
ఇవీచూడండి: తెలంగాణ తల్లి ప్రార్థన గీతాన్ని విడుదల చేసిన కేటీఆర్