ETV Bharat / city

రెడ్డి, వైశ్య కార్పొరేషన్ ఏర్పాటు చేయండి: ఓసీ సమాఖ్య

author img

By

Published : Mar 14, 2022, 5:06 PM IST

OC Confederation Assembly siege: అధికారంలోకి వచ్చి ఏడేళ్ల పాలన పూర్తి చేసుకున్నా తెరాస ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయడంలో పూర్తిగా విఫలమైందని ఓసీ సమాఖ్య జాతీయ అధ్యక్షుడు పొలాడి రామారావు విమర్శించారు. ఉద్యమాలను అణచివేయాలని చూసే ఏ ప్రభుత్వమైనా ఎక్కువ కాలం మనుగడ సాగించలేదని ఆయన హెచ్చరించారు. ఆదర్శ్ నగర్ న్యూ ఎమ్మెల్యే క్వార్టర్స్ నుంచి 'ఛలో అసెంబ్లీ'కి ర్యాలీగా వెళ్లిన సమాఖ్య నాయకులను పోలీసులు అడ్డుకున్నారు.

OC Confederation
ఓసీ సమాఖ్య

OC Confederation Assembly siege: రెడ్డి, వైశ్య కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ... తెలంగాణ రాష్ట్ర ఓసీ సామాజిక, సంక్షేమ సంఘాల సమాఖ్య ఛలో అసెంబ్లీకి పిలుపునిచ్చింది. ఆదర్శ్ నగర్ న్యూ ఎమ్మెల్యే క్వార్టర్స్ నుంచి అసెంబ్లీ ముట్టడికి ర్యాలీగా వెళ్లిన సమాఖ్య నాయకులను పోలీసులు అడ్డుకున్నారు. సమాఖ్య అధ్యక్షుడు రామారావుతో పాటు పలువురు నాయకులను అరెస్టు చేశారు.

OC Confederation chalo Assembly: అధికారంలోకి వచ్చి ఏడేళ్ల పాలన పూర్తి చేసుకున్నా తెరాస ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయడంలో పూర్తిగా విఫలమైందని ఓసీ సామాజిక సంఘాల సమాఖ్య జాతీయ అధ్యక్షుడు పొలాడి రామారావు విమర్శించారు. ఉద్యమాలను అణచివేయాలని చూసే ఏ ప్రభుత్వమైనా ఎక్కువ కాలం మనుగడ సాగించలేదని ఆయన హెచ్చరించారు.

OC Confederation chalo Assembly: ప్రస్తుత బడ్జెట్ సమావేశాల్లో రెడ్డి, వైశ్య కార్పొరేషన్ల ఏర్పాటుపై ప్రకటన చేయాలని డిమాండ్ చేశారు. ఎన్నికల ప్రణాళికలో ఈ రెండు కార్పొరేషన్ల ఏర్పాటు విషయాన్ని తెరాస స్పష్టంగా పేర్కొన్న విషయాన్ని ఆయన గుర్తు చేశారు. ఇప్పుడు జరుగుతున్న బడ్జెట్ సమావేశాల్లో వీటికి సంబంధించిన ప్రస్తావన లేకపోవడం పట్ల రామారావు ఆగ్రహం వ్యక్తం చేశారు.

'ఎన్నికలలో ఇచ్చిన హామీని అమలు చేయడానికి ప్రభుత్వానికి ఉన్న అభ్యంతరాలు ఏమిటో స్పష్టం చేయాల్సిన బాధ్యత ముఖ్యమంత్రిపై ఉంది. రెడ్డి, వైశ్య కులాల్లోని పేదల సంక్షేమం కోసం అవసరమైన నిధులు కేటాయిస్తూ.. చట్టబద్ధమైన కార్పొరేషన్లు ఏర్పాటు చేయాలి. ఇతర ఓసీ కులాల పేదల సంక్షేమానికి ప్రతి ఏటా వెయ్యి కోట్ల నిధులు విడుదల చేయాలి. ప్రస్తుత బడ్జెట్ సమావేశాల్లో ఈ కార్పొరేషన్ల ఏర్పాటుపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలి. లేని పక్షంలో మేము చేపట్టిన ఆందోళన ఉదృతం చేస్తాం. బడ్జెట్ సమావేశాల్లో 80 వేల పైచిలుకు ఉద్యోగాలు భర్తీ చేస్తామని ప్రకటించిన ప్రభుత్వం ఆ దిశగా సత్వర చర్యలు తీసుకోవాలి. ఉద్యోగాల్లో 10 శాతం ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ కోటాను తప్పనిసరిగా అమలు చేయాలి. ఓసీలు, రైతులు, నిరుద్యోగులను ఓటు బ్యాంకు రాజకీయాలకు వాడుకొనే విధానాలను ప్రభుత్వం వదిలి.. వారి సంక్షేమానికి అవసరమైన చర్యలు వెంటనే చేపట్టాలి.'

- పొలాడి రామారావు, ఓసీ సమాఖ్య జాతీయ అధ్యక్షుడు

ఇదీ చదవండి:Half day schools In Telangana: రాష్ట్రంలో రేపటి నుంచి ఒంటిపూట బడులు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.