ETV Bharat / city

rajamouli: ఏపీ సీఎం జగన్​తో రాజమౌళి భేటీ.. ఏం మాట్లాడారంటే..? - జగన్​తో రాజమౌళి సమావేశం

ఈ నెల 25 'ఆర్​ఆర్​ఆర్' విడుదల కానున్న నేపథ్యంలో దర్శకధీరుడు రాజమౌళి, నిర్మాత దానయ్య ఏపీ సీఎం జగన్​మోహన్​రెడ్డితో భేటీ అయ్యారు. 'ఆర్​ఆర్​ఆర్' భారీ బడ్జెట్​తో రూపొందించిన సినిమా కావడంతో ముఖ్యమంత్రితో ప్రత్యేకంగా చర్చించారు. సినిమాకు ఏం చేయాలో అది చేస్తానని సీఎం జగన్ హామీ ఇచ్చినట్లు రాజమౌళి వెల్లడించారు.

rajamouli: ఏపీ సీఎం జగన్​తో రాజమౌళి భేటీ.. ఏం మాట్లాడారంటే..?

author img

By

Published : Mar 14, 2022, 7:25 PM IST

rajamouli: ఏపీ సీఎం జగన్​తో రాజమౌళి భేటీ.. ఏం మాట్లాడారంటే..?

ఆంధ్రప్రదేశ్​ ముఖ్యమంత్రి జగన్‌తో సినీ దర్శకుడు రాజమౌళి, నిర్మాత దానయ్య భేటీ అయ్యారు. హైదరాబాద్ నుంచి ప్రత్యేక విమానంలో వచ్చిన వారు.. తాడేపల్లిలోని సీఎం నివాసంలో జగన్​ను కలిశారు. భారీ బడ్జెట్​తో తెరకెక్కిన 'ఆర్​ఆర్​ఆర్' చిత్రం త్వరలో విడుదల కానున్న నేపథ్యంలో సీఎంతో రాజమౌళి సమావేశమయ్యారు.

భేటీ అనంతరం గన్నవరం విమానాశ్రయంలో మీడియాతో మాట్లాడిన రాజమౌళి.. సీఎం చాలా బాగా రిసీవ్ చేసుకున్నారన్నారు. 'ఆర్​ఆర్​ఆర్' భారీ బడ్జెట్​తో రూపొందించిన సినిమా కనుక.. సినిమాకు ఏం చేయాలో అది చేస్తానని సీఎం జగన్ హామీ ఇచ్చినట్లు రాజమౌళి వెల్లడించారు.

మార్చి 25న ప్రేక్షకుల ముందుకు..

దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన 'ఆర్ఆర్​ఆర్'​.. మార్చి 25న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. రూ.450 కోట్ల భారీ బడ్జెట్​తో తెరకెక్కిన ఈ సినిమాలో రామ్​చరణ్ అల్లూరి సీతారామరాజుగా, ఎన్టీఆర్ కుమురం భీమ్​గా నటించారు. ఆలియా భట్, ఒలీవియా మోరిస్​ హీరోయిన్లు. అజయ్​ దేవ్​గణ్, సముద్రఖని, శ్రియ తదితరులు కీలక పాత్రలు పోషించారు. కీరవాణి సంగీతమందించారు. డీవీవీ దానయ్య నిర్మాతగా వ్యవహరించారు.

ఇదీ చదవండి: మహీంద్రా ఆఫీస్​లో 'ప్రాజెక్ట్​ కె'.. తొలి భారతీయ చిత్రంగా 'ఆర్​ఆర్​ఆర్​'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.