శ్రీశైలం జలాశయానికి భారీగా వరద చేరుతోంది. జలాశయం 8 గేట్లు ఎత్తి నీటిని విడుదల చేస్తున్నారు. ఇన్‌ఫ్లో 4,12,582 క్యూసెక్కులు కాగా..ఔట్‌ఫ్లో 2,90,953 క్యూసెక్కులకు చేరింది. డ్యాము పూర్తిస్థాయి నీటిమట్టం 885 అడుగులు అవ్వగా.. ప్రస్తుత నీటిమట్టం 883.90 అడుగులుకు చేరింది. పూర్తిస్థాయి సామర్థ్యం 215.80 టీఎంసీలు కాగా..ప్రస్తుత నీటి నిల్వ 208.7210 టీఎంసీలుగా ఉంది.
https://www.etvbharat.com/telugu/telangana/live-streaming/srisailam-live/ts20200820170336000
2 గంటల తరువాత జలాశయం 7 గేట్లు ఎత్తి నీటిని దిగువకు వదిలారు. ప్రస్తుత నీటిమట్టం 883.30 అడుగులు కాగా... ప్రస్తుత నీటినిల్వ 208 టీఎంసీలుగా ఉంది.ఉదయం 11 గంటల సమయంలో వరద ఎక్కువ అవగా జలాశయం 5 గేట్లు ఎత్తి దిగువకు నీటి విడుదల.. అంతకముందే వరద వల్ల 7 గంటలకు ఆనకట్ట మూడు గేట్లు ద్వారా దిగువకు నీరు విడుదల చేశారు. కుడి, ఎడమ జల విద్యుత్ కేంద్రాల్లో విద్యుదుత్పత్తి చేస్తున్నారు. ఎడమగట్టు విద్యుత్ కేంద్రం, కుడిగట్టు విద్యుత్ కేంద్రం, హంద్రీనీవా ఎత్తిపోతల ద్వారా పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటరీ ద్వారా నీటిని వదిలారు.
https://www.etvbharat.com/telugu/telangana/live-streaming/srisailam-live/ts20200820170336000