Srinivas goud launched Swadeshi Traveler website: తెలంగాణలో ప్రపంచ స్థాయి పర్యాటక ప్రదేశాలు చాలా ఉన్నాయని.. వాటిని పర్యాటకులు సందర్శించే విధంగా అభివృద్ధి చేస్తామని పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ అన్నారు. రాష్ట్రానికి విదేశీ, స్వదేశీ పర్యాటకులను ఆకర్షించే విధంగా టూరిజం ప్రమోషన్‌ను నిర్వహిస్తున్నట్లు మంత్రి తెలిపారు. హైదరాబాద్‌లోని క్యాంప్ కార్యాలయంలో స్వదేశీ ట్రావెలెర్స్ సంస్థ ఆధ్వర్యంలో రూపొందించిన వైబ్‌సైట్‌ను ఆయన ఆవిష్కరించారు.
రాష్ట్రం ఏర్పడిన తరువాత ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు తెలంగాణలో పర్యాటకాభివృద్ధికి అనేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని మంత్రి తెలిపారు. సీఎం కేసీఆర్ కృషి వల్ల రామప్ప దేవాలయంను ప్రపంచ వారసత్వ సంపదగా యునెస్కో గుర్తించిందన్నారు. భూదాన్ పోచంపల్లి గ్రామం వరల్డ్ బెస్ట్ విల్లేజ్గా ఎంపికైందని అన్నారు. ఈ సందర్భంగా మంత్రి శ్రీనివాస్ గౌడ్ స్వదేశీ ట్రావెలెర్స్ సంస్థ ప్రతినిధులు భానుప్రకాష్, దిలీప్‌లను అభినందించారు.
ఇవీ చదవండి: