బంగారాన్ని ఇతర దేశాల నుంచి అక్రమంగా రవాణా చేసుకోవడం, నిల్వ చేసి విక్రయించడం వంటి కేసుల కింద శ్రీకృష్ణ జ్యుయెలర్స్ ఎండీ ప్రదీప్ కుమార్‌ను డీఆర్ఐ అధికారులు అరెస్ట్ చేశారు. ఈ విషయం వ్యాపార వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. గత 50 ఏళ్లుగా హైదరాబాద్ కేంద్రంగా బంగారు ఆభరణాల వ్యాపారం నిర్వహిస్తూ అమెరికా, దుబాయి తదితర దేశాలకు కృష్ణ జ్యుయెల్లర్స్ వ్యాపారం విస్తరించింది. ప్రదీప్ కుమార్‌ను ఆదివారమే అదుపులోకి తీసుకున్నా బయటకు తెలియకుండా అధికారులు గోప్యత పాటించారు. కస్టమ్స్ చట్టంలోని సెక్షన్ 135 ప్రకారం ప్రదీప్‌ను అరెస్ట్ చేసినట్లు డీఆర్ఐ అధికారులు నాంపల్లి న్యాయస్థానానికి తెలిపారు. అతన్ని చంచల్‌గూడ జైలుకు తరలించారు.
శ్రీకృష్ణ జ్యుయెలర్స్ ఎండీ ప్రదీప్ అరెస్ట్
హైదరాబాద్‌లోని శ్రీకృష్ణ జ్యుయెలర్స్ ఎండీ ప్రదీప్ కుమార్‌ను డీఆర్ఐ అధికారులు అరెస్ట్ చేశారు. అతన్ని ఆదివారమే అదుపులోకి తీసుకున్నా బయటకు తెలియకుండా గోప్యత పాటించారు.