ఎస్ఆర్ నగర్ పోలీస్ స్టేషన్లో హోంగార్డుగా పనిచేస్తున్న అక్బర్ అలీ కరోనా చికిత్స పొందుతూ... ఈరోజు ఉదయం మృతి చెందినట్టు చెస్ట్ ఆసుపత్రి సూపరింటెండెండ్ తెలిపారు. అక్బర్ అలీకి మూడు క్రితం కరోనా పాజిటివ్ వచ్చింది. ఇంట్లోనే ఉంటూ... చికిత్స తీసుకుంటున్నాడు. మంగళవారం తెల్లవారుజామున అకస్మాత్తుగా షుగర్ లెవల్స్ పెరిగాయి. వెంటనే కుటుంబసభ్యులు... ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు చెప్పారు. అక్కడి నుంచి ఎర్రగడ్డ చెస్ట్ ఆసుపత్రికి తీసుకెళ్లగా... చికిత్స పొందతూ చనిపోయాడు.
ఇదీ చూడండి: రాష్ట్రంలో మరో 1610 కరోనా పాజిటివ్ కేసులు