కరోనా కట్టడికి జీహెచ్ఎంసీ డీఆర్ఎఫ్ బృందాలు హైదరాబాద్ జంట నగరాల్లో విస్తృతంగా హైడ్రో క్లోరైడ్ ద్రావణం పిచికారీ చేస్తున్నారు. జనసాంద్రత ఎక్కువగా తిరిగే ప్రదేశాలతో పాటు.. రెడ్ జోన్లలో నిత్యం స్ప్రే చేస్తున్నారు. నగరంలోని మాణిక్యనగర్, కుత్బుల్లాపూర్, రంగారెడ్డి నగర్, గాంధీనగర్, షాబాజ్గూడ ఏరియా, లక్ష్మి నగర్ కాలనీ, మల్కాజిగిరి ఏరియాల్లో చేశారు. జ్వర కేసులు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో కూడా జీహెచ్ఎంసీ సిబ్బంది చేశారు.
ఇదీ చదవండి: కరోనా కోరల్లో పాత్రికేయులు.. అండగా యువ జర్నలిస్టులు