ETV Bharat / city

ఐక్యూతో చంద్రబాబును ఆశ్చర్యపరిచిన బుడతడు - చంద్రబాబు వార్తలు

ఓ చిన్నారి మేధావి... తన మాటలతో తెదేపా జాతీయ అధ్యక్షుడు చంద్రబాబునే ఆశ్చర్యపరిచాడు. తాను సాధించిన విజయాలను తెలిపి ప్రశంసలు అందుకున్నాడు. ఇంతకీ ఎవరా చిన్నారి? చంద్రబాబును ఆయన ఎందకు కలిశాడు?

chandra babu
chandra babu
author img

By

Published : Feb 3, 2020, 10:46 PM IST

ఐక్యూతో చంద్రబాబును ఆశ్చర్యపరిచిన బుడతడు

గుంటూరు జిల్లా ఆత్మకూరులోని తెదేపా ప్రధాన కార్యాలయంలో.. పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబును... బాల మేధావి ఆకాష్ వుకోటి తన కుటుంబంతో సహా కలిశాడు. తాను సాధించిన విజయాలను చెప్పి చంద్రబాబు ప్రశంసలు అందుకున్నాడు. 'మిమ్మల్ని కలవడం చాలా ఆనందంగా ఉంది. మీ గురించి నాలుగు మాటల్లో చెప్పాలని అనుకుంటున్నాను. మిమ్మల్ని టీడీపీఎల్​ అని నేను పిలవాలని అనుకుంటున్నాను. టీ అంటే ట్రస్టెడ్ (విశ్వసనీయ), డీ అంటే డెవలప్​మెంట్ (అభివృద్ధి), పీ అంటే పాజిటివిటీ (సానుకూల దృక్పథం), ఎల్ అంటే లీడర్ షిప్ (నాయకత్వం)' అని చెప్పి.. చంద్రబాబునే ఆశ్చర్యపరిచాడు. తన లక్ష్యం అమెరికా అధ్యక్షుడు కావటం అని తెలిపాడు. ఆ చిన్నారి మాటలకు చంద్రబాబు ఆనందం వ్యక్తం చేసి ఆశీర్వదించారు.

ఎవరూ ఈ ఆకాష్ వుకోటి?

ఆకాష్ వుకోటి గురించి వింటే ఎవరికైనా పిట్టకొంచెం కూత ఘనం అనే సామెత గుర్తొస్తుంది. అమెరికాలో నిర్వహించే స్పెల్ బీ పోటీల్లో రెండేళ్ల వయసు ఉన్నప్పుడే విజేతగా నిలిచాడు. పిన్న వయసులోనే నేషనల్ స్పెల్ బీ మేధావిగా గుర్తింపు పొందాడు. ప్రపంచంలోనే అతిపెద్ద ఐక్యూ సొసైటీ అయిన మెన్సాలో మూడేళ్ల వయసుకే సభ్యుడయ్యాడు. హాలీవుడ్ సూపర్ స్టార్స్​తో షోలు కూడా చేశాడు. గోల్డ్ చైల్డ్ ప్రోడేజి అవార్డు 2020 విజేతగా నిలిచాడు. అంతేకాదు.. ఈ బుడతడికి ఓ యూ ట్యూబ్ ఛానల్​ కూడా ఉంది. దానికి 130 దేశాల నుంచి.. లక్షకు పైగా ఫాలోవర్స్ ఉన్నారు. ఈ బాల మేధావి తల్లిదండ్రులు ఏపీకి చెందినవారే. తల్లిది నెల్లూరు కాగా... తండ్రిది నెల్లూరు జిల్లా వెంకటగిరి.

ఇదీ చదవండి: జాతీయ మీడియా ఎండగట్టినా మీరు మారరా..?: చంద్రబాబు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.