ETV Bharat / city

Bonalu: ఆరోగ్యదాయిని.. అమ్మకు బోనం..

Bonalu: ప్రకృతికీ మనిషికీ విడదీయరాని బంధం ఉంది. మానవాతీత శక్తి మనల్ని నడిపిస్తోందని అనాదిగా నమ్ముతున్నాం. మన పుట్టుక, జీవనం, మరణం.. అన్నీ చిత్రవిచిత్రాలే. వాటి వెనుక శాస్త్రీయత ఎంత ఉన్నా.. విప్పలేని చిక్కుముళ్లెన్నో! అవి ప్రశ్నలుగానే మిగులు తున్నాయి. ఒక్కోసారి ఆలోచనాపటిమతో మనల్ని మనం స్థిమితపరచుకున్నా అనేక సందర్భాల్లో దైవశక్తిని విశ్వసించి ఆత్మస్థైర్యం పొందుతుంటాం. బోనాలు అందుకు సాక్షాత్కారం.

Bonalu
Bonalu
author img

By

Published : Jun 30, 2022, 5:00 AM IST

Bonalu: సృష్టికి మూలమైన శక్తిరూపంగా ‘అమ్మ’ దుర్గమ్మగా, కాళీమాతగా ఎన్నో రూపాల్లో పూజలందుకుంటోంది. దుష్టసంహరణార్థం పలు అవతారాలు దాల్చిన అమ్మవారు గ్రామ ప్రజల్ని, పాడిపంటల్ని కాపాడేందుకు గ్రామదేవతగా సాక్షాత్కరిస్తుంది. జగదాంబ, ఎల్లమ్మ, రేణుక, చండీ, మహంకాళి, దుర్గ, పోశమ్మ, మైసమ్మ, ముత్యాలమ్మ, డొక్కలమ్మ, కట్టమైసమ్మ, గండిమైసమ్మ- ఇలా తీరొక్క రూపాల్లో వెలసిన అమ్మవారిని పూజించి, ఆమె కృపతో రక్షణ పొందిన ప్రజలు, ఆషాఢ, శ్రావణ మాసాల్లో కృతజ్ఞతతో పూజిస్తారు. ఏడాదంతా కాపాడమంటూ వేడుకుంటారు.
తెలంగాణలో అమ్మవారిని పూజించే ఉత్సవం బోనాల పండుగ. సంస్కృతీ సంప్రదాయాలు కలబోసిన గ్రామదేవతల పండుగిది. ఆషాఢమాసంలో మొదలైన బోనాలు ఆ నెలంతా కొనసాగుతూ ఆదివారం నాడు బోనమెత్తే కార్యక్రమం అంగరంగవైభవంగా సాగుతుంది. ఆయా ఊళ్లలో, ఆయా బజారుల్లో తమ ప్రత్యేక రోజుల్లో బోనమెత్తి పండుగ జరుపుకుంటారు.
ప్రస్తుతం బోనాలు తెలంగాణ రాష్ట్ర పండుగగా ఘనంగా నిర్వహిస్తున్నా.. నిజానికి ఈ వైభవం ఇప్పటిది కాదు. కాకతీయుల కాలంలో కాకతీ దేవతకు బోనాలు సమర్పించినట్లు ఆధారాలున్నాయి.
ఆషాఢంలో బోనాలు.. విశేషాలు..
బోనం అంటే భోజనం, అన్నం. పాడిపంటల్ని వృద్ధి చేసిన తల్లికి కృతజ్ఞతగా నిండుగా భోజనాన్ని సమర్పించడమే బోనాలు. వర్షాకాలం ఆరంభమై వానలతో నీటి గుంటలతో ఊరంతా చిత్తడిగా పాచిపట్టినట్టుగా ఉండి అంటువ్యాధులు ప్రబలుతుంటాయి కనుక ఇంటినీ, ఊరినీ శుభ్రంచేస్తారు. సాన్పి (కళ్లాపి), ముగ్గు, వేపాకు, పసుపులతో సూక్ష్మక్రిములు దూరమౌతాయి.
బోనాలకు దగ్గరి బంధువులను పిలుచుకుంటారు. భక్తిశ్రద్ధలతో పూజలు నిర్వహిస్తారు. పసుపు రాసి వేపాకులతో అలంకరించిన బోనం కుండలో అన్నం, ఉల్లిగడ్డ, మిరియాలు, పరమాన్నం మొదలైనవి ఉంచి మూతపెట్టి, మూతలో నూనె పోసి, దీపం వెలిగిస్తారు. మొదట ఇంట్లో దేవుడి దగ్గరుంచి, తర్వాత ఆ బజారులోఉన్న దేవతామూర్తి గుడికి తీసుకెళ్తారు. మహిళలు కొత్త దుస్తులతో ముస్తాబై, తలపై బోనాన్ని పెటుకోగా.. కుటుంబసభ్యులు పూజా సామగ్రి తీసుకెళ్తారు. ఇంకొందరు అమ్మవారికి ఒడిబియ్యం, పూలు, గాజులు సమర్పిస్తారు. వంశం అభివృద్ధి చెంది, పిల్లాపాపలతో ఇల్లు ఆనందంగా ఉండాలని తొట్టెల కడతామని మొక్కులు చెల్లిస్తారు. బోనంతో ఇంటి నుంచి బయల్దేరేవేళ నీటితో సాకను పోస్తారు. మశూచి లాంటి అనారోగ్యాలు రాకూడదంటూ గుడి ముందు సాకబోయడం చూస్తాం. బోనాలవేళ జంతుబలి కూడా ఉంటుంది. ఇటీవల కోడిని సమర్పిస్తున్నారు. వైభవంగా సాగే బోనాల ఉత్సవం భాగ్యనగరానికే శోభను తెచ్చేలా నిర్వహిస్తారు.
గోలుకొండ ఖిల్లా మీద జగదాంబిక
మా నాగాంబిక
డప్పుల మోతలు అమ్మా జగదాంబ
దరువుల చప్పుడు అమ్మా జగదాంబ
అంటూ డప్పుల మోతలతో సాగే బోనాల పాటలతో జంటనగరాలు ఉత్సాహంతో పోటెత్తుతాయి. పల్లెల్లోనూ పట్టణాల్లోనూ శోభాయమానంగా వెలిగే ఈ ఉత్సవం ఉత్సాహం నింపే సంబురం. జులై 3న గోలకొండ జగదాంబ అమ్మవారితో మొదలయ్యే బోనాలు జులై 24న సికింద్రాబాద్‌ ఉజ్జయిని అమ్మవారి మహంకాళి జాతరగా ముగుస్తుంది. లాల్‌ దర్వాజ తదితర ప్రాంతాల్లోనూ ఈ ఉత్సవాలు దివ్యంగా సాగుతాయి.
సుఖ, సంతోషాలను ప్రసాదించే దేవతామూర్తులను కృతజ్ఞతతో శాంత పరిచే పండుగిది. ఇందులో కొంత శాంతం, కొంత రౌద్రం ఉంటుంది. ఘటం, రంగం, పోతు రాజుల విన్యాసం- ముఖ్య ఘట్టాలు. బోనం కుండను ఘటం అంటూ దేవి పుట్టింటికి వచ్చిందని, ఆమె సోదరులు పోతురాజులు వెంటరాగా, రంగంలో భవిష్యవాణిని వినిపించడం చూస్తాం.
కుటుంబ ఆచారంగా, కృతజ్ఞతాసూచకంగా సాగే ఆషాఢబోనాలు తెలంగాణ ప్రత్యేకం. కొన్ని ప్రాంతాల్లో శ్రావణమాసంలోనూ బోనాలు జరుపుకోవడం ఆనవాయితీగా ఉంది. అనాదిగా ఉన్న ఈ గ్రామ దేవతారాధన నేటికీ కొనసాగడం దివ్యమైన అంశం. సౌభాగ్య ఆరోగ్య ప్రదాత అయిన అమ్మను బోనాల వేళ పూజించి తరిద్దాం.

మహా జ్వాలాయ విద్మహే..

.

గాలి, నేల, నీరు, నిప్పు, ఆకాశం- ఈ పంచభూతాల్లో ఏది లేకున్నా మనుగడే లేదు. ముఖ్యంగా నిప్పు కనుక లేకపోతే వంటావార్పూ దగ్గర్నుంచి ప్రయాణాల వరకూ అన్నీ ఆగిపోతాయి. జీవనమే స్తంభించి పోతుంది. వేద వేదాంగాలూ పురాణ ఇతిహాసాలూ అగ్నిని ఎంతగానో కీర్తించాయి.
అగ్నిదేవుడు పరమాత్మ నోటినుండి ఉద్భవించాడని రుగ్వేదం, బ్రహ్మదేవుని జ్యేష్ఠ పుత్రుడని విష్ణుపురాణం వర్ణించాయి. అగ్ని, బ్రహ్మ, బ్రహ్మాండ, స్కాంద, తదితర పురాణాల్లో అగ్ని గురించి ఎన్నో వివరణలున్నాయి. అనలుడు, పావకుఁడు, వైశ్వానరుడు, వహ్ని, శుచి, హుతభుక్కు, సప్తజిహ్వుడు అంటూ అనేక పేర్లున్నాయి. నిప్పు, చిచ్చు, అగ్గి లాంటి వాడుక పదాలు తెలిసినవే.
అహం వైశ్వానరో భూత్వా ప్రాణినాం దేహమాశ్రితః
ప్రాణాపానసమాయుక్తః పచామ్యన్నం చతుర్విధమ్‌
సర్వేశ్వరుడనైన నేను ప్రాణుల శరీరాల్లో జఠరాగ్నిగా చేరి ప్రాణ, అపాన, వ్యాన, ఉదాన, సమాన- వాయువులతో కలిసి భక్ష్య, భోజ్య, లేహ్య, చోష్యాలను జీర్ణింప చేస్తున్నాను- అనేది భగవద్గీతలోని ఈ శ్లోకానికి అర్థం.
అగ్నిర్‌ హోతా కవిక్రతుః సత్యశ్చిత్ర శ్రవస్తమః
దేవో దేవేభి రాగమత్‌
సృజనాత్మక శక్తితో, సాధన క్రియలను నిర్వర్తిస్తూ, కంటికి కాంతిశక్తినీ, చెవికి నాదశక్తినీ అందిస్తూ వైవిధ్యమైన చిత్రధ్వని చిత్రాలు రూపొందిస్తాడు అంటూ అగ్నిదేవుణ్ణి స్తుతిస్తున్నారిందులో.
భవభూతి ఉత్తరరామచరితంలో...
ఉత్పత్తి పరిపూతాయాః కిమస్యాః పావనాంతరైః
తీర్థోదకం చ వహ్నిశ్చ నాన్యతః శుద్ధి మర్హతి
పుట్టుకతోనే పవిత్రురాలైన ఈమెను మరి వేటితోనూ పునీతం చేయనవసరం లేదు. అపవిత్రమైనవాటిని అగ్ని, తీర్థోదకాలతో శుద్ధిచేస్తామే గానీ వాటిని శుద్ధి చేయం కదా అంటూ సీతమ్మను అగ్నితో పోల్చాడు.
రుగ్వేదం అగ్నిసూక్తంలోని మంత్రాలిలా సాగాయి...
అగ్నిమీళే పురోహితం యజ్ఞస్య దేవమృత్విజమ్‌
హోతారం రత్నధాతమమ్‌
అందరికన్నా ముందుండి జనులకు హితంచేసే అగ్నిని స్తుతిస్తున్నాను.
యదఙ్గ దాశుషే త్వ మగ్నే భద్రం కరిష్యసి
తవేత్తత్‌ సత్యమఙ్గరః
తాను చేసే కర్మలను భగవత్సమర్పణం చేసేవారికి అగ్ని శుభం చేకూరుస్తాడు.
బడబాగ్ని, జఠరాగ్ని, దావాగ్ని అంటూ అగ్ని మూడు రకాలు. బడబం అంటే ఆడగుర్రం. సముద్రంలో ఆ రూపంలో ఉండి అందులోకి చేరిన నీటిని తగినంత మాత్రమే ఉంచుతూ, మిగిలిన నీటిని ఎప్పటికప్పుడు దహించేస్తుంటుంది. కనుకనే నదులన్నింటి నీరు వచ్చిచేరినా సముద్ర నీటిమట్టం స్థిరంగానే ఉంటుంది. జీవుల ఉదరంలో ఉండి ఆహారాన్ని దహింప(జీర్ణిం)చేసేది జఠరాగ్ని. ఆహారం దహనమైతేనే శరీరానికి శక్తి, సమయానుకూలంగా ఆకలి కలుగుతాయి. చెట్ల రాపిడితో పుట్టి అరణ్యాలను దహించేది దావాగ్ని.
కర్రల రాపిడితో నిప్పును పుట్టించి యజ్ఞయాగాలు చేస్తారు. అదే బ్రహ్మాగ్ని. శమీ వృక్షాన్ని అగ్నిగర్భ అంటారు. దీనిలో అగ్ని నిక్షిప్తమై ఉంటుందట. దీన్ని రావికట్టెతో మథించి అగ్గిని రాజేస్తారు. ఆహవనీయాగ్ని, దక్షిణాగ్ని గార్హపత్యం అనేవి త్రేతాగ్నులు. ఇవి గృహస్థులు నిత్యం అగ్ని ఆరాధనకు ఉపయోగించేవి. అగ్ని దేవతల పురోహితుడని వేదాల్లో ఉన్నందున వివాహాది వైదిక కర్మల్లో అగ్నిని సాక్షిగా చేశారు. తనలో వేసిన అన్నింటినీ దహించేస్తుందని అగ్నిని సర్వభక్షకుడు అన్నారు. యజ్ఞ భాగాలను హవిర్భాగాలంటారు. వీటిని అగ్ని ముఖంగానే సమర్పిస్తారు. ఆయన వాటిని హవనం చేసి ఆయా దేవతలకు అందిస్తాడు కనుక హవ్యవహనుడని, అన్నింటినీ పవిత్రపరుస్తాడని పావకుడని అన్నారు.
మనం నిత్యం చూసేది తైజసాగ్ని. తేజస్సుతో ఉంటుందని అర్థం. మెరుపుల్లో దాగి, వాటి ఘర్షణవల్ల పుట్టేది తటిత్‌. సూర్యునిలో దాగి లోకాన్ని ప్రకాశింప చేసేది దివ్యాగ్ని. ప్రాణుల్లో ఆహారాన్ని జీర్ణింపచేసేది వైశ్వానరం. పుత్రపౌత్రులను అనుగ్రహించేది ప్రాజాపత్యాగ్ని. గృహస్థాశ్రమ నియమాల్లో తొలి నైవేద్యాన్ని సమర్పించాల్సింది పత్యాగ్ని. శ్మశానంలో శరీరాన్ని దహించేది కవ్యాదాగ్ని. వేదాలు అగ్నిని దేవతగా పేర్కొంటే, పురాణాలు అష్టదిక్పాలకుల్లో ఒకటిగా చేర్చాయి. తూర్పు, దక్షిణ దిక్కుల సంగమ స్థలమైన ఆగ్నేయం అగ్నిది. కశ్యపుని కుమార్తె స్వాహాదేవి అగ్నిభార్య.
అగ్ని నా రయిమశ్నవత్‌ పోషమేవ దివే దివే
యశసం వీర వత్తమమ్‌
అగ్ని ఆరాధకులకు పుష్టిని, వికాసాన్ని, సర్వ శక్తులను, కీర్తిని, యశోరూప ధనాన్ని.. ఇలా సర్వం కలుగజేస్తుందని చెబుతున్నారు.
ఓం మహాజ్వాలాయ విద్మహే
అగ్ని మధ్యాయ ధీమహీ
తన్నో అగ్నిః ప్రచోదయాత్‌
‘అగ్నిదేవా! మమ్మల్ని మేధస్సుతో ప్రకాశింపచేయి’ అని ప్రార్థించడమే ఇందులో ఉన్న అర్థం పరమార్థం.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.