అందరూ సహకరించాలి: పోచారం శ్రీనివాస్ రెడ్డి - coronavirus updates
కరోనా కట్టడి కోసం రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలకు ప్రతి ఒక్కరూ సహకరించాలని శాసనసభాపతి పోచారం శ్రీనివాస్ రెడ్డి కోరారు. తన నియోజకవర్గమైన బాన్సువాడలోని అన్ని గ్రామాల ప్రజలు దారులను మూసివేయడం మంచి పరిణామమన్నారు.
అందరూ సహకరించాలి: పోచారం శ్రీనివాస్ రెడ్డి
ప్రజలందరూ స్వీయగృహ నిర్భందంలో ఉండాలని శాసనసభాపతి పోచారం శ్రీనివాస రెడ్డి విజ్ఞప్తి చేశారు. కరోనా కట్టడి కోసం రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలకు ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు. ప్రభుత్వం ఎన్నో చర్యలు తీసుకుందని, ప్రజలు కలిసి వస్తేనే నివారణ సాధ్యమని చెప్పారు.
తన నియోజకవర్గమైన బాన్సువాడలోని అన్ని గ్రామాల ప్రజలు దారులను మూసివేయడం మంచి పరిణామమన్నారు. విదేశాల నుంచి ఎవరైనా వస్తే వారి సమాచారాన్ని అధికారులను ఇవ్వాలని సూచించారు.