ETV Bharat / city

ఆ వార్తల్లో నిజం లేదు.. ప్రజలు నమ్మవద్దు: ద.మ.రైల్వే - telangana news

పూర్తి స్థాయిలో రైళ్లను నడిపించినప్పుడు కచ్చితంగా ప్రజలకు తెలియజేస్తామని దక్షిణ మధ్య రైల్వే పీఆర్వో రాకేశ్ తెలిపారు. ఏప్రిల్ నుంచి పూర్తి స్థాయిలో రైళ్లు నడుస్తాయని వెలువడుతున్న వార్తలు అబద్ధమని స్పష్టం చేశారు.

south central railway official said people should not believe the news that trains will be running at full capacity from April
ఆ వార్తల్లో నిజం లేదు.. ప్రజలు నమ్మవద్దు: ద.మ.రైల్వే
author img

By

Published : Feb 13, 2021, 10:52 PM IST

ఏప్రిల్ నుంచి పూర్తి స్థాయిలో రైళ్లు నడుస్తాయని వెలువడుతున్న వార్తలను ప్రజలు ఏమాత్రం నమ్మవద్దని దక్షిణ మధ్య రైల్వే ప్రజా సంబంధాల ముఖ్య అధికారి రాకేశ్​ ఒక ప్రకటనలో తెలిపారు. అటువంటి కచ్చితమైన తేదీని ద.మ.రైల్వే ఇంతవరకు నిర్ణయించలేదన్నారు.

ఇప్పటికే ద.మ.రైల్వే 65శాతం పైగా రైళ్లను నడిపిస్తుందని వెల్లడించారు. ఒక్క జనవరిలో మాత్రమే 250కి పైగా రైళ్లను నడిపించామని పేర్కొన్నారు. పూర్తి స్థాయిలో రైళ్లను నడిపించినప్పుడు కచ్చితంగా మీడియా ద్వారా ప్రజలకు తెలియజేస్తామని సీపీఆర్​ఓ రాకేశ్​ స్పష్టం చేశారు.

ఇదీ చూడండి: గుర్రంబోడు గిరిజనులకు న్యాయం చేయాలి... గవర్నర్​కు వినతి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.