ETV Bharat / city

Complaint on Srinivas goud: 'మంత్రి, అతని సోదరుడి నుంచి మాకు ప్రాణహాని ఉంది'

author img

By

Published : Jul 28, 2021, 4:33 PM IST

మంత్రి శ్రీనివాస్ గౌడ్ అతని సోదరుడు శ్రీకాంత్ గౌడ్ నుంచి తమకు ప్రాణహాని ఉందని.. మహబూబ్​నగర్ జిల్లాకు చెందిన దంపతులు రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ ఆశ్రయించారు. తమపై కేసులు పెట్టి వేధిస్తున్నారని ఆరోపించారు.

somebody allegations on minister srinivas goud
హెచ్ఆర్​సీ

హైదరాబాద్​లోని రాష్ట్ర మానవ హక్కుల కమిషన్​లో మహబూబ్​నగర్ జిల్లాకు చెందిన దంపతులు ఫిర్యాదు చేశారు. మంత్రి శ్రీనివాస్ గౌడ్ అతని సోదరుడు శ్రీకాంత్ గౌడ్ నుంచి తమకు ప్రాణహాని ఉందని ఫిర్యాదులో పేర్కొన్నారు. మంత్రి శ్రీనివాస్ గౌడ్​పై 2018 ఎన్నికల సమయంలో ఓ కేసు విషయంలో సాక్షిగా ఉన్న తమపై కక్ష కట్టిన మంత్రి అతని సోదరుడు అక్రమ కేసులు పెట్టి తీవ్ర వేధింపులకు గురిచేస్తున్నారని బాధితులు విశ్వనాధ రావు, పుష్పలత ఆరోపించారు.

స్థానిక రూరల్ సీఐ మహేశ్వర్​ను అర్ధరాత్రి ఇంటి పైకి పంపి భయబ్రాంతులకు గురి చేయిస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. నూతనంగా నిర్మించే తమ ఇంటి నిర్మాణాన్ని అడ్డుకోవడమే కాకుండా... ఓ ప్రైవేటు సంస్థలో పని చేస్తున్న తమ ఇద్దరి ఉద్యోగాలను కూడా మంత్రి తీసివేయించి... కుటుంబాన్ని వీధిన పడేశారని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా తమకు ప్రాణారక్షణ కల్పించాలని డిమాండ్​ చేశారు. తమను ఇదే విధంగా వేధిస్తే మంత్రి శ్రీనివాస్ గౌడ్ , అతని సోదరుడు శ్రీకాంత్ గౌడ్ పేర్లను లేఖలో రాసి పోలీస్ స్టేషన్ ముందు ఆత్మహత్య చేసుకుంటామని తెలిపారు.

మంత్రి శ్రీనివాస్​ గౌడ్​, అతని సోదరుడు శ్రీకాంత్​ గౌడ్​ మమ్మల్ని వేధిస్తున్నారు. ఎలక్షన్​ పిటిషన్​లో సాక్షిగా ఉన్నందుకు ఇబ్బందులకు గురి చేస్తున్నారు. రాత్రిపూట పోలీసులను ఇంటికి పంపించి పిల్లలను, నన్ను బెదిరించారు. మమ్మల్ని దుర్భషలాడారు. సీఐ మహేశ్వర్​ రాత్రి 11 గంటలకు ఇంటికి వచ్చి పోలీస్​ స్టేషన్​కు రావాలని బెదిరించారు. డీఎస్పీకి ఫోన్​ చేస్తే ఆయన భయపడొద్దని చెప్పారు.

-పుష్పలత, బాధితురాలు

'మంత్రి, అతని సోదరుడి నుంచి తమకు ప్రాణహాని ఉంది'

ఇదీ చదవండి: polycet 2021: పాలిసెట్‌ 2021 ఫలితాలు విడుదల

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.