ETV Bharat / city

జూలు విదిలిస్తున్న ప్రైవేట్ స్కూళ్లు.. దండిగా ఫీజు వసూళ్లు

Private Schools Fee : గత రెండేళ్లలో కరోనా సృష్టించిన విలయం వల్ల ప్రజలంతా ఆర్థికంగా నష్టపోయారు. చాలా మంది ఉపాధి కోల్పోయారు. దీనివల్ల వారి పిల్లల చదువుకు ఇబ్బందులు తలెత్తాయి. దీన్ని గుర్తించిన రాష్ట్ర సర్కార్ రెండేళ్లపాటు ట్యూషన్ ఫీజులు పెంచొద్దని జీవో జారీ చేసింది. ఇప్పుడు ఆ రెండేళ్లు పూర్తయ్యాయి. గతంలో జరిగిన నష్టాన్ని రికవరీ చేసుకునేందుకు కొన్ని ప్రైవేట్ పాఠశాలలు కాచుకు కూర్చున్నాయి. విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి గత రెండేళ్ల ఫీజు కూడా రాబట్టేందుకు ప్రణాళికలు రచిస్తున్నాయి.

Private Schools Fee
Private Schools Fee
author img

By

Published : Mar 31, 2022, 7:32 AM IST

Private Schools Fee : కరోనా పరిస్థితుల్లో ట్యూషన్‌ ఫీజులను పెంచొద్దని రాష్ట్ర ప్రభుత్వం గత రెండు విద్యా సంవత్సరాలకు జీవోలు జారీచేయడంతో ఆ మొత్తాన్ని రికవరీ చేసుకునేందుకు ఇపుడు పలు ప్రైవేట్‌ పాఠశాలలు తహతహలాడుతున్నాయి. ప్రాథమిక విద్య.. అంటే 5వ తరగతి నుంచి ఆరో తరగతిలోకి వెళ్లేవారికి 15-30 శాతం వరకు పెంచి వసూలు చేస్తున్నాయి. స్లాబ్‌ మార్పు పేరిట ఈ పెంపును అమలుచేస్తున్నాయి. ముఖ్యంగా కొన్ని ఇంటర్నేషనల్‌, సీబీఎస్‌ఈ బోర్డు అనుబంధ పాఠశాలలు ఒక్కసారిగా జూలు విదిలిస్తున్నాయి. స్లాబ్‌ మారకుండా ఉన్నచోట 10 శాతంలోపు పెంచుతున్నాయి. ఉదాహరణకు 4 నుంచి 5వ తరగతిలోకి ప్రవేశించినప్పుడు పెంపు 10 శాతంలోపే ఉంటుంది. అదే స్లాబ్‌ మారితే మోత తప్పదు. ఫీజుల నియంత్రణ చట్టం కోసం విధివిధానాల రూపకల్పనకు నియమించిన 13మంది మంత్రుల ఉపసంఘం మార్చి 2న సమావేశమైంది. 10 శాతంలోపు పెంచుకునేందుకు తీర్మానించింది. దానిపై ప్రభుత్వం తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. ఈక్రమంలో కొత్త విద్యా సంవత్సరానికి ఫీజులు పెంచుకోవచ్చని భావించిన పలు పాఠశాలల యాజమాన్యాలు.. కొత్త ఫీజులను ఖరారుచేసి తల్లిదండ్రులకు సమాచారం ఇస్తున్నాయి.

ఆర్డినెన్స్‌ తేవటమే ఏకైక మార్గం.. పాఠశాలల ఫీజుల నియంత్రణ చట్టాన్ని తీసుకురావాలని గత జనవరి 17న జరిగిన మంత్రివర్గ సమావేశంలో ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దానిపై మంత్రివర్గ ఉపసంఘాన్ని నియమించింది. అది మార్చి 2న సమావేశమైంది. మరోసారి సమావేశమై చర్చించాలని భావించారు. చట్టం తేవాలంటే బడ్జెట్‌ సమావేశాల్లోనే బిల్లును ప్రవేశపెట్టాల్సి ఉంది. అందుకు అంతా సిద్ధమైనా ఎందుకో ఆగిపోయింది. ఇక వచ్చే విద్యా సంవత్సరానికి చట్టం చేయాలంటే మళ్లీ ఇప్పట్లో అసెంబ్లీ సమావేశాలు లేనందున గవర్నర్‌తో ఆర్డినెన్స్‌ ఇప్పించడమే ప్రభుత్వం ముందున్న ఏకైక మార్గమని నిపుణులు చెబుతున్నారు. మొత్తానికి ఏదో ఒకటి చేయని పక్షంలో మరిన్ని ప్రైవేట్‌ పాఠశాలలు ఇష్టారాజ్యంగా ఫీజులు పెంచవచ్చన్న ఆందోళన వ్యక్తమవుతోంది.

ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు : "ప్రైవేట్‌ పాఠశాలలపై ప్రభుత్వం నియంత్రణ కోల్పోయింది. అందుకు ప్రధాన కారణం చిత్తశుద్ధి లేకపోవడమే. ఫీజుల నియంత్రణపై ఏం చేస్తారో చెప్పాలని హైకోర్టు గట్టిగా అడిగింది. దాని నుంచి తప్పించుకునేందుకు చట్టం తెస్తామని హడావుడి చేశారు. అది తెలిసే పాఠశాలల యాజమాన్యాలు మళ్లీ భారీగా పెంచుతున్నాయి."

-వెంకట్‌, సంయుక్త కార్యదర్శి, హైదరాబాద్‌ స్కూల్స్‌ పేరెంట్స్‌ అసోసియేషన్‌(హెచ్‌ఎస్‌పీఏ)

  • కోకాపేటలోని ఓ గ్లోబల్‌ స్కూల్‌లో గత ఏడాది 5వ తరగతి ఫీజు రూ.లక్ష. ఇప్పుడు ఆ విద్యార్థి ఆరో తరగతిలోకి ప్రవేశించాడు. చెల్లించాల్సిన రుసుం రూ.1.26 లక్షలు. అంటే 25 శాతం పెరిగింది.
  • నగర శివారు పుప్పాలగూడలోని ఓ ప్రముఖ స్కూల్‌లో గత విద్యా సంవత్సరానికి ఫీజు రూ.60వేలు. ఆరో తరగతిలోకి ప్రవేశించాలంటే ఇప్పుడది రూ.80వేలకు చేరింది.. అంటే 33 శాతం పెరిగింది.
  • బేగంపేటలోని ఓ ప్రముఖ ప్రైవేట్‌ పాఠశాలలో గత ఏడాది అయిదో తరగతికి ట్యూషన్‌ ఫీజు రూ.97 వేలుండగా...ఈసారి ఆరో తరగతిలోకి వచ్చిన ఆ విద్యార్థి రూ.1.11 లక్షలు చెల్లించాలి. అంటే 14 శాతం భారం పడింది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.