కడప జిల్లా గాలివీడు మండలం తూముకుంట పంచాయతీ దిగువకుంటలో విషాదం చోటు చేసుకుంది. స్థానికంగా నివాసం ఉంటున్న వేణుగోపాలనాయుడు, ఈశ్వరమ్మ దంపతుల ముగ్గురు పిల్లలు ఇంట్లో నిద్రిస్తున్న సమయంలో పాము కాటేసింది. ఈ ఘటనలో ఒకరు చనిపోగా.. మరో ఇద్దరు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. స్థానికులు పామును గుర్తించి చంపేశారు.
ఇటీవల కురిసిన వర్షాలకు గ్రామంలోకి వర్షపు నీరు చేరింది. ఫలితంగా విష పురుగులు, పాములు ఇళ్లలోకి వస్తున్నాయని స్థానికులు చెబుతున్నారు. ఒకే ఇంట్లో ముగ్గురు పాము కాటుకు గురి కావడం, ఒకరు మృతి చెందడం వల్ల గ్రామంలో విషాదఛాయలు అలముకున్నాయి.
ఇదీ చదవండి: విశాఖలో మరోసారి విషవాయువు విడుదల.. పలువురికి అస్వస్థత