ఏపీలోని శ్రీకాకుళం జిల్లా సంత బొమ్మాళి మండలం నౌపడ గ్రామానికి చెందిన యర్రం రెడ్డి అనే వ్యక్తి ఇంట్లో.. పాముల గుంపు బయటపడింది. గోడలో నక్కిన వాటిని గమనించిన కుటుంబీకులు.. తవ్వినకొద్దీ బయటికి వచ్చిన పాములు చూసి భయభ్రాంతులకు గురయ్యారు. నిన్న రాత్రి భోజనం చేస్తుండగా... గోడ వద్ద రెండు పాము పిల్లలను గమనించారు. కాసేపటికి మరికొన్నింటిని గుర్తించారు. అనంతరం గోడను పగలగొట్టగా సుమారు 60 పిల్లల వరకూ బయటపడ్డాయి.
ఇవీ చూడండి: నేడు పేదల బ్యాంకు ఖాతాల్లో జమకానున్న రూ.1500