ఏపీ కడప జిల్లాలోని బ్రహ్మంగారి మఠం పీఠాధిపతి వివాదంపై దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావుకు.. తాళ్లాయపాలెం శైవక్షేత్రం పీఠాధిపతి శివస్వామి మధ్యంతర నివేదిక అందించారు. 9 మంది పీఠాధిపతులు మఠాన్ని సందర్శించి అందరి అభిప్రాయాలు సేకరించినట్లు శివస్వామి తెలిపారు. 11వ పీఠాధిపతి రెండో భార్య వీలునామాపై సుదీర్ఘంగా చర్చించినట్లు వివరించారు.
మఠంలో అవకతవకలు జరుగుతున్నాయని తమ దృష్టికి వచ్చిందన్నారు. ఆలయ కీర్తి ప్రతిష్టలు దెబ్బతినకుండా వెంటనే దేవాదాయ శాఖ ఓ అధికారిని నియమించాలని మంత్రిని కోరినట్లు చెప్పారు. పూర్తి నివేదికను పదో తేదీలోపు ప్రభుత్వానికి అందిస్తామన్నారు.