ETV Bharat / city

దిశ నిందితుల ఎన్‌కౌంటర్ బూటకం: సుప్రీంకు సిర్పూర్కర్ కమిషన్​ నివేదిక

author img

By

Published : May 20, 2022, 1:58 PM IST

Updated : May 20, 2022, 6:59 PM IST

disha accused encounter case
దిశ నిందితుల ఎన్‌కౌంటర్

18:50 May 20

దిశ నిందితుల ఎన్‌కౌంటర్ బూటకమన్న సిర్పూర్కర్ కమిషన్

disha accused encounter case
దిశ నిందితుల ఎన్​కౌంటర్ కేసులో సిర్పూర్కర్​ కమిషన్​ నివేదిక

Disha accused encounter case: దిశ నిందితుల ఎన్​కౌంటర్ కేసు ఎన్నో మలుపులు తిరిగింది. ఎన్​కౌంటర్ జరిగిన నాటి నుంచి దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఈ ఘటనపై సిర్కూర్పర్ కమిషన్ నివేదికతో మరోసారి చర్చనీయాంశమైంది. సుదీర్ఘ విచారణ జరిపిన త్రిసభ్య కమిషన్​.. దిశ కేసు నిందితుల ఎన్​కౌంటర్ బూటకమని జస్టిస్ వి.ఎస్​ సిర్పూర్కర్ కమిషన్ తేల్చింది. 10 మంది పోలీసులపై హత్య కేసు పెట్టి విచారణ జరపాలని సిఫార్సు చేసింది. మృతుల్లో ముగ్గురూ మైనర్లేనని కమిషన్ వెల్లడించింది. ఎఫ్ఐఆర్ నమోదు నుంచి అడుగడునా పోలీసుల తీరు అనుమానాస్పదంగా ... లోపభూయిష్టంగా ఉందని సుప్రీంకోర్టుకు సమర్పించిన నివేదికలో అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది.

13:56 May 20

అదంతా కట్టుకథ..: దిశ నిందితుల ఎన్​కౌంటర్​పై సుప్రీంకోర్టు ఏర్పాటు చేసిన జస్టిస్ వి.ఎస్​ సిర్పూర్కర్ కమిషన్ సంచలన నివేదిక రూపొందించింది. ఎన్​కౌంటర్ కట్టుకథ అని తేల్చింది. కొవిడ్ పరిస్థితుల్లోనూ సుదీర్ఘ విచారణ జరిపిన జస్టిస్ వీఎస్ సిర్కూర్కర్, జస్టిస్ పీఎస్బీ రేఖ, డాక్టర్ డీఆర్ కార్తికేయన్​తో కూడిన కమిషన్... సుప్రీంకోర్టుకు సమర్పించిన 387 పేజీల నివేదికలో కీలక విషయాలను వెల్లడించింది. దిశ హత్యాచారం ఘటనకు సంబంధించిన ఎఫ్ఐఆర్ నమోదులో జాప్యం జరిగిందని కమిషన్ వివరించింది. ఉదయం జరిగిన ఘటనపై ఎఫ్ఐఆర్​ను కోర్టుకు సాయంత్రం సమర్పించడాన్ని తప్పుపట్టింది. ఎఫ్ఐఆర్ నమోదులో జాప్యం వెనక దురుద్దేశాలు ఉండొచ్చని కమిషన్ అభిప్రాయపడింది. నిందితులు పిస్టోళ్లు లాక్కొని కాల్పులు జరుపుతూ పారిపోయారనే పోలీసుల వాదన ఏ మాత్రం నమ్మశక్యంగా లేదని కమిషన్ తెలిపింది. నిందితులకు పిస్టోల్ పేల్చే విధానం తెలియదని పేర్కొంది. పారిపోతుంటే 41 రౌండ్ల కాల్పులు జరపాల్సి వచ్చిందని పోలీసులు చెప్పారని... అయితే వాటికి సంబంధించి ఆధారాలు సమర్పించకపోవడం అనుమానాస్పదంగా ఉందని వెల్లడించింది.

ముగ్గురు మైనర్లే..: నిందితులు దాడి చేశారని.. గాయపడిన పోలీసులకు ఓ కార్పొరేట్ ఆస్పత్రిలోని ఐసీయూలో చికిత్స చేసినట్లు చెబుతున్న పోలీసులకు.. వైద్యుల వాంగ్మూలాలకు పొంతన కుదరడం లేదని ధర్మాసనానికి సమర్పించిన నివేదికలో కమిషన్ పేర్కొంది. సీసీటీవీ, పంచనామా, నేర ఘటనకు సంబంధించి వీడియో దృశ్యాలు పూర్తిగా సమర్పించకపోవడం వెనక దురుద్దేశాలు ఉన్నట్లు కమిషన్ అభిప్రాయపడింది. వివిధ రికార్డుల ప్రకారం జొల్లు శివ, జొల్లు నవీన్, చెన్నకేశవులు మరణించే నాటికి మైనర్లేనని కమిషన్ స్పష్టం చేసింది. ఎదురుకాల్పుల్లోనే నిందితులు మరణించారన్న పోలీసుల వాదన నమ్మశక్యంగా లేదని కమిషన్ స్పష్టం చేసింది.

వారిపై హత్యానేరం నమోదు..: చంపాలన్న ఉద్దేశంతోనే పోలీసులు కాల్పులు జరపడంతో నిందితులు మరణించినట్లు కమిషన్ అభిప్రాయపడింది. ఈ మేరకు 10 మంది పోలీసు అధికారులపై హత్యా నేరం అభియోగాలతో విచారణ జరపాలని సిర్పూర్కర్ కమిషన్ సిఫార్సు చేసింది. పోలీసు అధికారులు వి.సురేందర్, కె.నర్సింహారెడ్డి, షేక్ లాల్ మాధర్, మొహమ్మద్ సిరాజుద్దీన్, కొచ్చెర్ల రవి, కె.వేంకటేశ్వర్లు, ఎస్.అరవింద్ గౌడ్, డి.జానకీరాం, ఆర్.బాలు రాథోడ్, డి.శ్రీకాంత్ పై ఐపీసీ 302 రెడ్ విత్ 34, 201 రెడ్ విత్ 302, 34 సెక్షన్ల ప్రకారం విచారణ జరపాలని నివేదికలో పేర్కొంది.

దిశ ఘటనతో దేశవ్యాప్తంగా దిగ్భ్రాంతి..: 2019 నవంబర్ 27 న సాయంత్రం ఇంట్లో నుంచి ఆస్పత్రికి వెళ్లిన యువవైద్యురాలు దిశ ఆచూకీ లేకుండా పోయింది. తల్లిదండ్రులు అదే రోజు శంషాబాద్ పోలీస్ స్టేషన్​లో ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మరుసటి రోజు ఉదయం చటాన్​పల్లి వద్ద జాతీయ రహదారి పైవంతెన కింద కాలుతూ ఉన్న యువతి మృతదేహాన్ని గుర్తించి గొర్రెల కాపరి పోలీసులకు సమాచారమిచ్చాడు. మృతురాలిని దిశగా తేల్చిన పోలీసులు పూర్తి వివరాలు సేకరించారు. మహబూబ్​నగర్​ జిల్లా మక్తల్ మండలానికి చెందిన చెన్నకేశవులు, ఆరిఫ్, శివ, నవీన్​లు హత్యాచారానికి పాల్పడినట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. నిందితులను 29న అరెస్ట్ చేసి రిమాండ్​కు తరలించారు.

ఎన్​కౌంటర్​ తర్వాత ఏం జరిగింది..: 2019 డిసెంబర్ 4న నలుగురు నిందితులను పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు. దిశకు చెందిన వస్తువులను నిందితులు ఎక్కడ దాచారో తెలుసుకునేందుకు డిసెంబర్ 6వ తేదీ తెల్లవారుజామున చటాన్ పల్లికి నలుగురు నిందితులను తీసుకెళ్లారు. పోలీసుల వద్ద ఉన్న రెండు తుపాకులను లాక్కెళ్లిన నిందితులు, సంఘటనా స్థలం నుంచి పారిపోయేందుకు ప్రయత్నించారు. ఆ సమయంలో జరిగిన ఎదురు కాల్పుల్లో నిందితులు సంఘటనా స్థలంలోనే మృతి చెందారు. ఎన్​కౌంటర్ జరిగిన తీరుపై అనుమానం వ్యక్తం చేస్తూ సామాజిక కార్యకర్తలు, మానవ హక్కుల సంఘాలు హైకోర్టుతో పాటు, సుప్రీంకోర్టులోనూ పిటిషన్లు దాఖలు చేశారు. పిటిషన్ల ఆధారంగా త్రిసభ్య కమిషన్​ను సుప్రీంకోర్టు డిసెంబర్ 12న ఏర్పాటు చేసింది. సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ సిర్పూర్కర్ నేతృత్వంలో ఏర్పాటైన త్రిసభ్య కమిషన్ విచారణ ప్రారంభించింది.

కరోనా టైంలోనూ దర్యాప్తు.. : తెలంగాణ హైకోర్టు ప్రాంగణంలో సిర్పూర్కర్ కమిషన్ కోసం ఏర్పాటు చేసిన కార్యాలయంలో కమిషన్ విచారణ నిర్వహించింది. 2020 మార్చిలోనే విచారణ ప్రారంభించింది. ఆర్నెళ్ల లోపు విచారణ పూర్తి చేయాలని నిర్ణయించుకున్నప్పటికీ కరోనా కారణంగా వాయిదా పడుతూ వచ్చింది. సుప్రీంకోర్టు గడువు పెంచడంతో 2021 ఆగస్టులో విచారణ వేగవంతం చేసిన సిర్పూర్కర్ కమిషన్... పలువురిని ప్రశ్నించింది. హోంశాఖ కార్యదర్శి రవిగుప్తతో ప్రారంభమైన విచారణ, రాచకొండ సీపీ​ మహేశ్​ భగవత్, అప్పటి సైబరాబాద్ సీపీ సజ్జనార్, సిట్​కు నేతృత్వం వహించిన సురేందర్ రెడ్డి, శంషాబాద్ డీసీపీ ప్రకాశ్​ రెడ్డి, ఎన్​కౌంటర్​లో పాల్గొన్న పోలీసు అధికారులు, ఎయిమ్స్, గాంధీ ఆస్పత్రి వైద్యులు, ఎన్​కౌంటర్ జరిగిన సమయంలో పంచనామా నిర్వహించిన అధికారులు, క్లూస్ టీం అధికారులు, సాక్షులు, ప్రత్యక్ష సాక్షులు, మృతుల కుటుంబసభ్యులు, అఫిడవిట్లు దాఖలు చేసిన న్యాయవాదులను కమిషన్ ప్రశ్నించింది. దాదాపు మూడు నెలల పాటు విచారణ నిర్వహించిన సిర్పూర్కర్ కమిషన్.. తుది నివేదికను సుప్రీంకోర్టుకు సమర్పించింది. విచారణ సందర్భంగా తాము సేకరించిన సమాచారాన్ని, తమ అభిప్రాయాలను త్రిసభ్య కమిషన్.. తన నివేదికలో పొందుపర్చింది. రెండున్నరేళ్ల కిందట జరిగిన ఘటనపై వెలువడిన సిర్పూర్కర్ కమిషన్ నివేదిక చర్చనీయాంశమైంది.

ఇవీ చదవండి: దిశ నిందితుల ఎన్‌కౌంటర్ కేసు హైకోర్టుకు బదిలీ

భారత్​లో 'ఒమిక్రాన్‌ బీఏ.4' కలకలం.. హైదరాబాద్​లో తొలికేసు నమోదు

Last Updated : May 20, 2022, 6:59 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.