ETV Bharat / city

Simhachalam: సింహాచలంలో ఉంగరం మాయం.. మంత్రి, సినీనటుడిని బంధించిన సిబ్బంది..!

Simhachalam: ఏపీలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రం సింహాచలం శ్రీవరాహలక్ష్మీ నృసింహ స్వామివారి ఆలయంలో ఆదివారం ఉదయం వజ్రాల ఉంగరం మాయమైంది. దీంతో.. ఆలయ అధికారులు, పూజారులు, వైదిక సిబ్బంది తీవ్ర ఆందోళనకు గురయ్యారు. ఆలయంలో అన్ని చోట్లా వెతికినా.. ఉంగరం కనిపించలేదు. ఆ సమయంలో స్వామివారి దర్శనానికి వచ్చిన భక్తులందరినీ విచారించారు. కొందరిని తాళ్లతో కట్టేశారు. సరిగ్గా అదే సమయంలో సింహాచలం వచ్చిన మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణను సైతం విచారించారు. అనుమానం రావడంతో తాళ్లతో బంధించారు. ఉంగరం ఎక్కడ దాచారో చెప్పాలని ప్రశ్నించారు. ఇదంతా చూసిన పలువురు సామాన్యభక్తులు భయంతో పరుగులు తీశారు.

Simhachalam
సింహాచలంలో మంత్రి వేణగోపాల కృష్ణ
author img

By

Published : Apr 18, 2022, 5:16 PM IST

Simhachalam: ఏపీలోని విశాఖ జిల్లా సింహాచలంలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం.. శ్రీవరాహలక్ష్మీ నృసింహ స్వామివారి వజ్రాల ఉంగరం మాయమైంది. ఈ సంఘటనతో గాబరాపడిన ఆలయ సిబ్బంది, పూజారులు, వైదిక సిబ్బంది ఆలయంలో హడావిడి చేశారు. స్వామివారి ఉంగరాన్ని వెతికి పట్టుకునేందుకు అన్నిచోట్లా వెతుకులాడారు. కానీ.. ఎక్కడా లభించకపోవడంతో.. ఆ సమయంలో స్వామివారి దర్శనానికి వచ్చిన భక్తులను తాళ్లతో కట్టేసి విచారించారు. రాష్ట్ర మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ, సినీనటుడు కేదార్‌శంకర్​ను సైతం దొంగల జాబితాలో చేర్చారు. ఈ హడావిడి చూసిన పలువురు భక్తులు భయంతో పరుగులు తీశారు. అయితే.. ఇదంతా.. స్వామివారి వార్షిక తిరు కల్యాణోత్సవాల్లో భాగంగా నిర్వహించే.. "ఉంగరపు సేవ" కార్యక్రమంలో భాగమేనని తెలియడంతో ఊపిరి పీల్చుకున్నారు.

శనివారం రాత్రి జరిగిన దొంగల దోపిడీ ఉత్సవానికి కొనసాగింపుగా.. ఆదివారం ఉదయం ఈ "ఉంగరపు సేవ" వేడుకను వినోదాత్మకంగా నిర్వహించారు. చోరీకి గురైన స్వామివారి ఉంగరాన్ని వెతికే ఘట్టాన్ని అర్చకులు, సిబ్బంది చక్కగా నిర్వహించారు. రక్షక భటుడిగా అర్చకుడు కరి సీతారామాచార్యులు, విచారణాధికారిగా స్థానాచార్యులు టి.పి.రాజగోపాలాచార్యులు వ్యవహరించారు. వీరు.. రాష్ట్ర మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణను, సినీనటుడు కేదార్‌శంకర్​ను ఇంకా.. ఈవో సూర్యకళ, దేవస్థానం ట్రస్టీలు శ్రీనుబాబు, దినేశ్‌రాజ్‌తోపాటు పలువురు భక్తులను, అధికారులను బంధించి.. చోరీకి గురైన స్వామి వారి ఉంగరాన్ని మీరే తీశారంటూ ప్రశ్నించిన తీరు భక్తులకు వినోదాన్ని పంచింది.

ఉత్సవంలో భాగంగా ముత్యాల పల్లకీలో మహారాజా అలంకరణలో ఆశీనులైన స్వామివారి మేలి ముసుగులో బంగారు ఉంగరం దొరకడంతో వినోదోత్సవం ఉత్సాహంగా ముగిసింది. అనంతరం ఆలయ భోగమండపంలో స్వామి, అమ్మవార్ల సంవాదోత్సవం సంప్రదాయబద్ధంగా నిర్వహించారు. ఉంగరం లేకపోతే లోనికి రానివ్వబోమని అమ్మవార్లు స్వామి వారిని గుమ్మం ఎదుటే తలుపులు మూసి వేసిన ఘట్టాన్ని వేడుకగా నిర్వహించారు. సంవాద సేవ అనంతరం అమ్మవార్లు ప్రసన్నం కావడంతో.. అమ్మవారు, స్వామివారి తరఫున భక్తులు పూలబంతులు విసురుకుని ఆనందాన్ని వ్యక్తం చేశారు. బేడామండపంలో తిరువీధి, పూర్ణాహుతితో ఉత్సవం ముగిసింది.

సింహాచలంలో ఉంగరం మాయం.. మంత్రి, సినీనటుడిని బంధించిన సిబ్బంది..!
ఇదీ చదవండి: Pranahitha pushkaralu: సండే ఎఫెక్ట్.. పుష్కరాలకు భారీగా తరలివచ్చిన భక్తులు!!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.