ETV Bharat / city

Godown Problems in Telangana : ధాన్యం తరలింపులో జాప్యం.. గోదాముల సమస్య తీవ్రతరం - తెలంగాణలో గోదాముల సమస్య

Godown Problems in Telangana : రాష్ట్రంలో కొత్త పంటలు దాచుకునేందుకు చోటులేక రైతులు అవస్థలు పడుతున్నారు. రైల్వే లైన్లకు సమీపంలో ఉన్న గోదాముల్లో మాత్రమే ఎఫ్​సీఐ నిల్వలకు అనుమతిస్తుండటం వల్ల ఇబ్బందులు ఎదురవుతున్నాయి. మార్కెటింగ్‌ శాఖకు చెందిన 151 గోదాముల్లో నిల్వకు చోటున్నా అవన్నీ గ్రామాల్లో ఉన్నాయని,  రైలు మార్గాలు లేనందున వాటిని ఉపయోగించలేమని ఎఫ్‌సీఐ చెబుతోంది.

Godown Problems, గోదాముల సమస్యలు
తెలంగాణలో గోదాంల సమస్యలు
author img

By

Published : Dec 16, 2021, 6:59 AM IST

Godown Problems in Telangana : రాష్ట్రంలో గోదాముల సమస్య రోజురోజుకూ తీవ్రమవుతోంది. ఉన్న వాటిని ఉపయోగించుకోకపోవడం, ఏడాదిన్నర క్రితం పెట్టిన నిల్వలను ఇప్పటికీ తరలించకపోవడంతో కొత్త పంటలు, ఎరువులను ఉంచడానికి ఇబ్బందులు ఎదురవుతున్నాయి. డీజిల్‌, పెట్రోలు ధరలు పెరగడంతో రవాణా ఖర్చులు తగ్గించుకోవడానికి రైలు మార్గాలకు సమీపంలో ఉన్న గోదాముల్లో మాత్రమే భారత ఆహార సంస్థ (ఎఫ్‌సీఐ) నిల్వలకు అనుమతిస్తోంది. ప్రస్తుతం మొత్తం 9.16 లక్షల టన్నుల సామర్ధ్యం ఉన్న గోదాములు సిద్ధంగా ఉన్నాయి. ఇందులో రైలు మార్గాలకు దగ్గరగా ఉన్నవి 2 లక్షల టన్నులకే సరిపోతుండడంతో మరిన్ని కావాలని ఎఫ్‌సీఐ అడుగుతోంది.

Warehouse Problems in Telangana : ప్రస్తుతం రాష్ట్రంలో ఎఫ్‌సీఐ పెట్టిన మొత్తం బియ్యం నిల్వలు 10.65 లక్షల టన్నులుంటే అందులో మార్కెటింగ్‌ శాఖ గోదాముల్లో 43,895 టన్నులు, రాష్ట్ర గిడ్డంగుల సంస్థ (ఎస్‌డబ్ల్యూసీ) సొంత గోదాముల్లో 55,169 టన్నులు ఉంచారు. మిగతావన్నీ ప్రైవేటు గోదాముల్లోనే ఉన్నాయి. మార్కెటింగ్‌ శాఖకు చెందిన 151 గోదాముల్లో 5.94 లక్షల టన్నుల నిల్వకు చోటున్నా అవన్నీ గ్రామాల్లో ఉన్నాయని, రైలు మార్గాలు లేనందున వాటిని ఉపయోగించలేమని ఎఫ్‌సీఐ చెబుతోంది.

తరలింపులో జాప్యం..

Godowns Shortage Telangana :రైతుల నుంచి పౌరసరఫరాల సంస్థ ధాన్యం కొని బియ్యంగా మార్చి ఎఫ్‌సీఐకి ఇస్తోంది. వీటి తరలింపు మందకొడిగా ఉండడం కూడా గోదాముల సమస్యకు కారణమవుతోంది. గూడ్సు రైళ్లు సరిగా రావడం లేదని, ఇతర రాష్ట్రాల్లో డిమాండ్‌ లేదని గతేడాది నుంచి నిల్వ ఉంచిన బియ్యాన్ని ఇంకా తరలించలేదు. ఇవి లక్షల టన్నుల్లో ఉన్నాయని ఎస్‌డబ్ల్యుసీ అధ్యయనంలో తేలింది. గతేడాది (2020-21) రాష్ట్రంలో 1.41 కోట్ల టన్నుల బియ్యాన్ని ఎఫ్‌సీఐ సేకరించింది. ఈ వానాకాలంలో గత రెండు నెలల్లో 42.24 లక్షల టన్నుల ధాన్యాన్ని పౌరసరఫరాల సంస్థ రైతుల నుంచి కొనుగోలు చేసింది. వీటిని మిల్లుల్లో మరపట్టించి బియ్యంగా మార్చి ఎఫ్‌సీఐకి అందజేయాలి. మిల్లులో మరపట్టిన తరవాత బియ్యాన్ని వేగంగా గోదాములకు పంపితేనే ధాన్యం తీసుకోవడం సాధ్యమవుతుంది. కానీ గోదాములు ఖాళీగా లేవని ఎఫ్‌సీఐ చెబుతుండడంతో మిల్లుల నుంచి బియ్యం తరలడం లేదు. ధాన్యం కొనుగోళ్లు వేగంగా జరక్కపోవడానికి ఇదో కారణమని అధికార వర్గాలు తెలిపాయి. ఎక్కడ ఖాళీ ఉంటే అక్కడ నిల్వ పెట్టడానికి ఎఫ్‌సీఐ ముందుకొస్తే ఇప్పటికిప్పుడు 9 లక్షల టన్నులకు పైగా నిల్వకు చోటుందని, కానీ ఎఫ్‌సీఐ రవాణా ఖర్చులు, రైలు మార్గాల పక్కనే..అంటూ కొర్రీలు పెడుతుండడం వల్ల మొత్తం ప్రక్రియలో తీవ్ర జాప్యం జరుగుతున్నట్లు రాష్ట్ర ప్రభుత్వానికి అధికారులు తెలిపినట్లు సమాచారం.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.