ఏపీలోని నెల్లూరులో ఓ లఘ చిత్ర షూటింగ్.. పోలీసులను పరుగులు పెట్టించింది. నగరంలో కత్తులతో పోరాట సన్నివేశాలు చిత్రీకరిస్తుండగా.. స్థానికులు నిజమైన ఘర్షణ అనుకుని పోలీసులకు సమాచారమిచ్చారు.
పోలీసులు అక్కడికి చేరుకోవడంతో కొంతసేపు గందరగోళం ఏర్పడింది. చివరకు చిత్రీకరణ అని తెలియడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ప్రజలకు ఇబ్బంది కలిగించేలా షూటింగ్ చేయవద్దంటూ.. పోలీసులు వారిని మందలించి వదిలేశారు.
ఇవీ చూడండి: అలర్ట్: రెండు దశాబ్ధాల తర్వాత ఆ జిల్లాలో పులి గాండ్రింపులు