రిజర్వేషన్లు, ఫీజు రీయంబర్స్‌మెంట్‌ను అమలు చేయని ప్రైవేట్ యూనివర్శిటీలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఎస్‌ఎఫ్‌ఐ నిరసన దీక్ష చేపట్టింది. ప్రభుత్వ యూనివర్శిటీలకు ఉపకులపతులను నియమించాలని కోరింది. హైదరాబాద్ ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర కార్యాలయంలో నిరసన దీక్షను మాజీ ఎంపీ, సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ప్రారంభించారు.
ప్రైవేట్ యూనివర్శిటీల్లో రిజర్వేషన్లు అమలు చేయకపోతే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాల విద్యార్థులు తీవ్రంగా నష్టపోతారని పేర్కొన్నారు. కార్పొరేట్ విశ్వవిద్యాలయాలను నిషేధించాల్సిన అవసరం ఉందన్నారు. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న ప్రభుత్వ యూనివర్సిటీలకు ఉపకులపతులను నియమించాలని ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఆర్.ఎల్.మూర్తి, నాగరాజు డిమాండ్ చేశారు.
ఇదీ చదవండి: రైతన్నల 'రైల్ రోకో'.. శుక్రవారం రాష్ట్రబంద్‌కు పిలుపు