ETV Bharat / city

Senior NTR Daughter Funeral: అశ్రునయనాల మధ్య ఎన్టీఆర్ కూతురి అంత్యక్రియలు.. - ఎన్టీఆర్ కుమారులు

Senior NTR Daughter Funeral: నందమూరి తారకరామారావు కుమార్తె కంఠమనేని ఉమామహేశ్వరి అంత్యక్రియలు ముగిశాయి. హైదరాబాద్‌ జూబ్లీహిల్స్‌లోని మహాప్రస్థానంలో ఉమామహేశ్వరి అంతిమ సంస్కారాలు నిర్వహించారు. కుటుంబసభ్యులు, బంధువులు తరలి వచ్చి తుది వీడ్కోలు పలికారు. సోదరులు బాలకృష్ణ, రామకృష్ణ ఇతర కుటుంబసభ్యులు పాడె మోసి.. సాంప్రదాయ పద్ధతిలో దహన సంస్కారాలు నిర్వహించారు.

maheshwari
maheshwari
author img

By

Published : Aug 3, 2022, 1:06 PM IST

Senior NTR Daughter Funeral: నందమూరి కుటుంబసభ్యుల అశ్రనయనాల మధ్య నందమూరి తారకరామారావు చిన్న కుమార్తె ఉమామహేశ్వరి అంతిమ సంస్కారాలు ముగిశాయి. కొంతకాలంగా అనారోగ్యంతో బాధ పడుతున్న ఆమె హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లోని నివాసంలో సోమవారం బలవన్మరణానికి పాల్పడ్డారు. ఉస్మానియా ఆస్పత్రిలో పోస్టుమార్టం పూర్తయిన తర్వాత ఉమామహేశ్వరి భౌతికకాయాన్ని ఆమె ఇంటికి తీసుకెళ్లారు. ఎల్వీ ప్రసాద్ ఆస్పత్రి సూచన మేరకు ఆమె నేత్రాలను సేకరించారు. ఉమామహేశ్వరి పెద్ద కుమార్తె అమెరికాలో ఉండగా ఆమె వచ్చే వరకు అంత్యక్రియలు జరపలేదు. ఈ తెల్లవారుజామున 3గంటలకు విశాల హైదరాబాద్‌ చేరుకున్నారు.

NTR Family attend: ఉమామహేశ్వరిని కడసారి చూసేందుకు పలువురు రాజకీయ, సినీ ప్రముఖులు తరలివచ్చారు. ఉమామహేశ్వరికి నివాళి అర్పించారు. అనంతరం ఉమామహేశ్వరి నివాసం నుంచి జూబ్లీహిల్స్‌ మహాప్రస్థానం వరకు అంతిమయాత్ర సాగింది. తెలుగు దేశం అధినేత చంద్రబాబు, సోదరుడు, సినీహీరో బాలకృష్ణతో పాటు నందమూరి కుటుంబసభ్యులు, బంధువులు అంతిమయాత్రలో పాల్గొన్నారు. అనంతరం, మహాప్రస్థానంలో ఉమామహేశ్వరి భౌతికకాయానికి సంప్రదాయపద్ధతిలో అంతిమ సంస్కారాలు పూర్తి చేశారు.

అశ్రునయనాల మధ్య ఎన్టీఆర్ కూతురి అంత్యక్రియలు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.