ETV Bharat / city

అగ్రనేతల ప్రచారంతో వేడెక్కిన బల్దియా.. గల్లీగల్లీలో పర్యటనలు

బల్దియా పోరులో ప్రధాన ఘట్టమైన నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగిసింది. ప్రధాన పార్టీల అభ్యర్థులెవరో స్పష్టత వచ్చింది. ఇక పోరుకు అన్ని రకాల అస్త్ర శస్త్రాలను సిద్ధం చేసుకున్నాయి. అగ్రనేతలు ప్రచారంలోకి దిగడంతో హైదరాబాద్‌ రాజకీయంగా వేడెక్కింది. ఈ వారం రోజులు పెద్దఎత్తున ప్రజల్లోకి వెళ్లేలా సంబంధిత పార్టీలు ప్రణాళిక రూపొందించాయి. ఇప్పటికే డివిజన్ల వారీ బాధ్యతలు అందుకున్నవారు గల్లీగల్లీల్లో పర్యటిస్తున్నారు. ప్రచారం పరంగా కాంగ్రెస్‌ కొంత వెనుకబడి ఉంది.

senior leaders campaign for ghmc elections 2020
అగ్రనేతల ప్రచారంతో వేడెక్కిన బల్దియా
author img

By

Published : Nov 23, 2020, 7:32 AM IST

తెరాస.. రోడ్‌షోలలో దూసుకెళ్తూ

ఉన్న తక్కువ సమయాన్ని ఉపయోగించుకుని గెలుపు అవకాశాలను మెరుగుపర్చుకోవాలని ప్రధాన పార్టీలు ఉన్నాయి. తెరాస నేతలు సుడిగాలి ప్రచారం మొదలుపెట్టారు. రెండో రోజు కూడా మంత్రి కేటీఆర్‌ నాలుగు చోట్ల రోడ్‌షోలు నిర్వహించారు. వేలాదిమంది తరలి వస్తుండటంతో నేతలు సంతోషంగా ఉన్నారు. ఈనెల 28న జరిగే ముఖ్యమంత్రి కేసీఆర్‌ సభను విజయవంతం చేసేందుకు నేతలు భారీ జనసమీకరణపై దృష్టిసారించారు. ఎమ్మెల్సీ కవిత కూడా ప్రచారం చేపడుతున్నారు. శివారు ప్రాంతాల్లో మంత్రి హరీష్‌ సమన్వయం చేస్తున్నారు.

భాజపా.. రంగంలోకి జాతీయ నేతలు

2023లో జరగనున్న తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు ఇప్పటి నుంచే క్షేత్రస్థాయిలో పట్టుకు గ్రేటర్‌ ఎన్నికలపై భాజపా దృష్టిపెట్టింది. జాతీయ నేతలు సైతం ప్రచార రంగంలోకి దిగుతున్నారు. ఇప్పటికే కేంద్ర మంత్రి ప్రకాశ్‌జావడేకర్‌, మరో కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డితో కలిసి తెరాస ఆరేళ్ల పాలనపై ఛార్జీషీటు విడుదల చేశారు. అనంతరం బస్తీల్లో పర్యటించారు. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌కుమార్‌, నిజామాబాద్‌ ఎంపీ అరవింద్‌, డి.కె.అరుణ, రఘునందన్‌, డాక్టర్‌ కె.లక్ష్మణ్‌ తదితరులు విస్తృతంగా పర్యటిస్తున్నారు. బెంగళూరు దక్షిణ ఎంపీ, బీజీవైఎం జాతీయ అధ్యక్షుడు తేజస్వి సూర్య సోమవారం ‘ఛేంజ్‌ హైదరాబాద్‌’ నినాదంతో ప్రచారం కొనసాగించనున్నారు. ఎంపీ, క్రికెటర్‌ గౌతం గంభీర్‌, సినీనటి కుష్బూను కూడా ప్రచారానికి తీసుకురావాలని అనుకుంటున్నారు.

కాంగ్రెస్‌.. ఇంకా అగ్రనేతలు రాక

అభ్యర్థుల తరఫున కాంగ్రెస్‌ పార్టీ అగ్రనేతలు ఇంకా బరిలో దిగలేదు. తెలంగాణ కాంగ్రెస్‌ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జి, ఎంపీ మాణిక్కం ఠాగూర్‌, పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి, మల్కాజిగిరి ఎంపీ రేవంత్‌రెడ్డి, మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి తదితర ముఖ్య నేతలు ప్రచారంలో పాల్గొంటున్నారు.

40 డివిజన్లపై..

మహానగరంలో దాదాపు 20 లక్షలమంది ఇతర రాష్ట్రాల ఓటర్లు ఉన్నారని అంచనా. ఉపాధి, ఉద్యోగాల కోసం అనేక ప్రాంతాల నుంచి వచ్చి ఇక్కడ నివాసం ఉంటున్నారు.

* ప్రధానంగా ఇతర రాష్ట్రాల ఓటర్లు దాదాపు 40 డివిజన్లపై ప్రభావం చూపించే అవకాశం ఉంది. వీరిని తమవైపు లాక్కోవడానికి ప్రధాన పార్టీలు ప్రయత్నిస్తున్నాయి. వివిధ సంఘాల నేతలను పిలిపించి మంత్రి కేటీఆర్‌ మాట్లాడుతున్నారు.

● భాజపా ఉత్తరాది ఓటర్లను ప్రసన్నం చేసుకోవడానికి సంబంధిత రాష్ట్రాల నేతలను రప్పించి పనిలో ఉంది.

రంగంలో రెబల్స్‌

నేతల బుజ్జగింపులు పలు చోట్ల ఫలించలేదు. పోటీకే పలువురు రెబల్స్‌ మొగ్గు చూపుతున్నారు. ఆయా డివిజన్లలో స్వతంత్రులుగా రంగంలోకి దిగాలని నిర్ణయించుకున్నారు. నామినేషన్ల ఉపసంహరణ గడువు ఆదివారంతో ముగిసిన సంగతి తెలిసిందే. పార్టీల ముఖ్య నేతలు జరిపిన చర్చలు, ఇచ్చిన హామీలతో కొందరు రెబల్స్‌ రంగం నుంచి తప్పుకోగా..మరికొందరు మాత్రం ఎన్నికల రణరంగంలో తేల్చుకుంటామని చెబుతున్నారు. తిరుగుబాటుదారులు ఉన్నచోట ఎక్కడ తమ ఓట్లు చీలిపోయి....ప్రత్యర్థి పార్టీలకు లాభం చేకూరుతుందోననే ఆందోళనను అభ్యర్థులు వ్యక్తం చేస్తున్నారు. అన్ని రకాలుగా ఒత్తిడి తీసుకొచ్చి తిరుగుబాటు అభ్యర్థులను తమ దారిలోకి తెచ్చుకునేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. ప్రస్తుతానికి పోటీలో ఉన్నా...ప్రచారం నుంచి తప్పించాలని మంతనాలు సాగిస్తున్నారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.