ETV Bharat / city

ఆనందయ్య మందుపై పరిశోధన.. రోగుల వివరాలు సేకరిస్తున్న వైద్యులు - తిరుపతి ఆయుర్వేద కళాశాల వార్తలు

ఏపీలోని నెల్లూరు జిల్లా కృష్ణపట్నంలో కరోనా రోగులకు ఆనందయ్య అందించిన ఔషధంపై.. తిరుపతి ఆయుర్వేద కళాశాలలో రెండో రోజు పరిశోధన కొనసాగుతోంది. కొవిడ్​ సోకి మందు తీసుకున్న వారిలో కనీసం 500 మందిపై మందు ప్రభావాన్ని పరిశీలిస్తే ప్రాథమికంగా నిర్ధారించవచ్చని వైద్యులు స్పష్టం చేశారు.

anandaiah
ఆనందయ్య మందుపై తిరుపతి ఆయుర్వేద కళాశాలలో రెండో రోజు పరిశోధన
author img

By

Published : May 25, 2021, 1:22 PM IST

ఏపీలోని నెల్లూరు జిల్లా కృష్ణపట్నంలో కొవిడ్​ బాధితులకు ఆనందయ్య ఇచ్చిన ఔషధంపై… సీసీఆర్ఏఎస్ పరిశోధన రెండో రోజు కొనసాగుతోంది. జాతీయ ఆయుర్వేద పరిశోధనా సంస్థ ఆదేశాల మేరకు విజయవాడ, తిరుపతి ఆయుర్వేద కళాశాల బృందాలు ఆనందయ్య వద్ద మందు తీసుకున్న వారి నుంచి వివరాలు సేకరిస్తున్నారు.

తిరుపతి శ్రీ వెంకటేశ్వర ఆయుర్వేద వైద్య కళాశాల వారు నిన్న ఒక్కరోజే… మందు వాడిన 190 మంది నుంచి వివరాలు సేకరించారు. ఫోన్ల ద్వారా సమాచారం సేకరించటంలో సాంకేతిక ఇబ్బందులు ఉంటున్నాయని వైద్యులు తెలిపారు. కొంతమంది రోగులు స్థానిక ఆరోగ్య కార్యకర్తల ఫోన్​ నెంబర్లు ఇచ్చినట్లు గుర్తించామన్నారు. కరోనా రాకుండా ముందు జాగ్రత్తగా ఔషధం తీసుకున్న వారే ఎక్కువగా ఉన్నట్లు తెలిపారు.

కరోనా సోకి.. ఔషధం తీసుకున్న వారి నుంచి వివరాలు సేకరిస్తే.. మందు ఫలితం తెలిసే వీలుంటుందని ఆయుర్వేద వైద్యులు అన్నారు. అలాంటి వారిలో కనీసం 500 మంది నుంచి… సమాచారం తెలుసుకుని విశ్లేషిస్తేనే ఆనందయ్య మందు ప్రభావంపై ప్రాథమిక నిర్ధారణకు రాగలమని వైద్యులు చెబుతున్నారు. ఇందుకోసం… ఔషధం తీసుకున్న మరికొంత మంది ఫోన్ నెంబర్లు సేకరించి పంపించాల్సిందిగా నెల్లూరు జిల్లా అధికారులను వైద్యులు కోరారు. యుద్ధ ప్రాతిపదికన.. ఈ రోజు అభిప్రాయ సేకరణ కార్యక్రమాన్ని పూర్తి చేయాలని భావిస్తున్నట్లు ఆయుర్వేద వైద్యులు తెలిపారు.

ఇదీ చదవండి: సీఎం కేసీఆర్​ను కలిసిన జేఎన్టీయూ వీసీ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.