ఏపీ పరిషత్ ఎన్నికల్లో కొవిడ్ మార్గదర్శకాలు తప్పక పాటించాలని ఆ రాష్ట్ర ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. ఈ మేరకు ఆదేశిస్తూ ఏపీ ఎస్‌ఈసీ నీలం సాహ్ని ఉత్తర్వులు జారీ చేశారు. సీఈసీ నిబంధనల మేరకు అభ్యర్థులు, పార్టీలు వ్యవహరించాలని... పోలీసులు, ఎన్నికల సిబ్బందికి టీకాల్లో ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు.
'6 అడుగుల దూరం పాటించాలి'
ప్రచార వేళ 6 అడుగుల దూరం పాటించాలని స్పష్టం చేశారు. పోలింగ్ సిబ్బందికి మాస్కులు, శానిటైజర్లు అందుబాటులో ఉంచాలని ఆదేశించారు. పోలింగ్ సమయంలో ఒకసారి ఒక ఓటరునే అనుమతించాలని చెప్పారు. ప్రచారంలో అభ్యర్థుల వెంట ఐదుగురి కంటే ఎక్కువమంది ఉండకూడదని సూచించారు.
- ఇదీ చదవండీ : రెండో దశ: బంగాల్లో 86%, అసోంలో 81% పోలింగ్