ఏపీలో మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల ఉపసంహరణపై ఆ రాష్ట్ర ఎన్నికల కమిషన్ కీలక ఆదేశాలు జారీ చేసింది. బలవంతపు ఉపసంహరణలపై కొన్ని పార్టీల నుంచి ఫిర్యాదులు వచ్చాయని.. అటువంటి వాటిని అంగీకరించవద్దని ఎస్ఈసీ స్పష్టం చేసింది.
ఉపసంహరణ నోటీసులను యాంత్రికంగా అనుమతించవద్దని.. ప్రక్రియను వీడియో చిత్రీకరణ చేయాలని ఆదేశించింది. మూడో పక్షం నుంచి ఉపసంహరణలను అంగీకరించవద్దని ఉత్తర్వులిచ్చింది. ఎన్నికల్లో అక్రమాలకు పాల్పడినవారిపై కఠిన చర్యలు తీసుకోవాలని.. కలెక్టరు, ఎన్నికల అధికారులను ఆదేశించింది.
ఇవీచూడండి: నామినేషన్లు వేయని 12 పంచాయతీలు, 725 వార్డుల్లో మళ్లీ ఎన్నికలు