ఆంధ్రప్రదేశ్‌లోని విజయనగరం జిల్లా చీపురుపల్లి మండలం పుర్రేవలస గ్రామంలో కంది లక్ష్మి అనే మహిళ నివసిస్తోంది. ఈ క్రమంలో ఆమె కలలో రాజరాజేశ్వరి(రాజులమ్మ) అమ్మవారు వచ్చి.. విగ్రహాలు పంట పొలంలో ఉన్నాయని, వాటిని వెలికితీసి గుడి కట్టించమని కోరిందని లక్ష్మి తెలిపింది. ఆందోళనకు గురైన ఆమె.. తన కుమారుడు రామకృష్ణ సహాయంతో విగ్రహాల కోసం తవ్వకాలు ప్రారంభించింది.
కూలీల సహాయంతో ఇప్పటివరకు 30అడుగుల లోతు వరకు తవ్వారు. ఇందుకు సుమారు రూ.1.5లక్షలు ఖర్చు చేసినట్లు రామకృష్ణ తెలిపారు. రెండు, మూడు రోజుల్లో విగ్రహాలు దొరుకుతాయని, విగ్రహాలు లభ్యం కాగానే తన ఆస్తులు అమ్మైనా సరే.. అమ్మవారికి గుడి కట్టిస్తానని లక్ష్మి చెబుతోంది. ఈ సంఘటనను చూసిన వారు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.