ఏపీలో ఇవాళ్టి నుంచి ఏడో తరగతి విద్యార్థులకు పాఠశాలలు పునఃప్రారంభం కానున్నాయి. ఇప్పటికే దశల వారీగా 10, 9, 8 తరగతులకు పాఠశాలలు తెరిచిన ప్రభుత్వం... ఏడో తరగతి ప్రారంభానికీ చర్యలు చేపట్టింది. మిగిలిన తరగతులకు సంక్రాంతి సెలవుల తర్వాతే పాఠశాలలు తెరవాలని సర్కారు యోచిస్తోంది. ఆయా విద్యార్థులను బడికి పంపించేలా తల్లిదండ్రులతో ఉపాధ్యాయులు ప్రత్యేక సమావేశాలు నిర్వహించనున్నారు.
'పఠనాన్ని ఇష్టపడతాం' కార్యక్రమంలో భాగంగా విద్యార్థుల తల్లిదండ్రుల ద్వారా గ్రంథాలయ పుస్తకాలను పిల్లలకు అందించనున్నారు. మరోవైపు... ప్రభుత్వ ఉపాధ్యాయులు, ప్రధానోపాధ్యాయులంతా ప్రతిరోజు పాఠశాలలకు హాజరు కావాలని ప్రభుత్వం నిర్దేశించింది. అంగన్‌వాడీ కేంద్రాలను సంప్రదించి, ప్రాథమిక స్థాయిలో ప్రవేశాలకు వయస్సు కలిగిన పిల్లలందర్నీ వారు బడుల్లో చేర్పించాల్సి ఉంటుంది.
- ఇదీ చదవండి : అతి వేగం.. బతుకులు ఆగం..