ETV Bharat / city

tadepalli rape case: ఆ సెక్షన్లు పెట్టకుండానే ఎఫ్‌ఐఆర్‌ - తాడేపల్లి రేప్ కేసు వార్తలు

ఎప్పుడైనా, ఎక్కడైనా... ఎస్సీలపై అఘాయిత్యాలు జరిగితే అట్రాసిటీ నిరోధక చట్టంలోని సెక్షన్లను వర్తింపజేస్తారు. కానీ ఆంధ్రప్రదేశ్​లోని సీతానగరం పుష్కర్‌ఘాట్‌ సమీపంలో యువతిపై అత్యాచార ఘటన(tadepalli rape case)లో గుంటూరు పోలీసులు అలా చేయలేదు. బాధిత యువతి ఎస్సీ వర్గానికి చెందినప్పటికీ ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ నిరోధక చట్టంలోని సెక్షన్లను వర్తింపజేయలేదు

http://10.10.50.85:6060///finalout4/andhra-pradesh-nle/finalout/24-June-2021/12242617_rape.jpg
tadepalli rape case: ఆ సెక్షన్లు పెట్టకుండానే ఎఫ్‌ఐఆర్‌
author img

By

Published : Jun 24, 2021, 10:03 AM IST

ఎక్కడైనా సరే.. ఎస్సీలపై అఘాయిత్యాలు జరిగితే ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ నిరోధక చట్టంలోని సెక్షన్లను వర్తింపజేసి నిందితులపై కేసు నమోదు చేస్తారు. ఆంధ్రప్రదేశ్​ ముఖ్యమంత్రి జగన్‌ నివాసానికి కిలోమీటరున్నర దూరంలో కృష్ణా నదీ తీరంలోని సీతానగరం పుష్కర్‌ఘాట్‌ సమీపంలో విజయవాడకు చెందిన ఎస్సీ యువతిపై అత్యాచార ఘటన(tadepalli rape case)కు సంబంధించి నమోదు చేసిన కేసులో గుంటూరు అర్బన్‌ జిల్లా పోలీసులు అలా చేయలేదు.

బాధిత యువతి ఎస్సీ వర్గానికి చెందినప్పటికీ ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ నిరోధక చట్టంలోని సెక్షన్లను వర్తింపజేయలేదు. ఈ సంఘటనపై తాడేపల్లి పోలీసుస్టేషన్‌ పరిధిలో నమోదు చేసిన క్రైం నంబరు 697/2021లో ఐపీసీలోని 342, 376-డీ, 384, 323, 506 రెడ్‌విత్‌ 34 సెక్షన్లను పెట్టారు. అక్రమ నిర్బంధం, అత్యాచారం, బెదిరింపు, దాడి, కొందరు కలిసి నేరపూరిత బెదిరింపునకు పాల్పడటంవంటి అభియోగాలను మోపారు. వీటితోపాటు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ నిరోధక చట్టంలోని సెక్షన్లను ఈ కేసులో వర్తింపజేస్తే కేసు తీవ్రత పెరగటంతోపాటు దోషులకు ఎక్కువ శిక్ష పడే అవకాశం ఉంటుంది. కానీ పోలీసులు అలా చేయలేదు.

సాధారణంగా ఏదైనా సంఘటన జరిగినప్పుడు నిందితులెవరో తెలియకపోతే బాధితులు ఎస్సీ వర్గానికి చెందిన వారైనప్పటికీ అట్రాసిటీ నిరోధక చట్టంలోని సెక్షన్లను తొలుత ఎఫ్‌ఐఆర్‌లో పొందుపరచరు. నిందితుల వివరాలు తెలిశాక వారు ఎస్సీలు కాకపోతేనే అట్రాసిటీ నిరోధక చట్టంలోని సెక్షన్లను వర్తింపజేస్తారు అని పోలీసు వర్గాలు చెబుతున్నాయి. అయితే ఈ వాదన సరికాదని, బాధితురాలు ఎస్సీ అని తెలిసినప్పుడు అట్రాసిటీ నిరోధక చట్టంలోని సెక్షన్లను కచ్చితంగా వర్తింపజేయాలని కొందరు న్యాయవాదులు చెబుతున్నారు. నిందితులూ ఎస్సీలని తెలిస్తే అప్పుడు ఆ సెక్షన్లను ఎఫ్‌ఐఆర్‌ నుంచి తప్పించవచ్చని వారు అభిప్రాయపడుతున్నారు.

ఇదీ చదవండి : HIGH COURT: పెద్దలే కరోనా నిబంధనలు పాటించట్లే... పిల్లలు పాటిస్తారా?

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.