ETV Bharat / city

అంగన్​వాడీ సరుకులు ఇక ఇంటికే..: సత్యవతి రాథోడ్​

గ్రామాలు, పట్టణాల్లోని ప్రసవానికి దగ్గరగా ఉండే గర్భిణీ స్త్రీల జాబితా సిద్ధం చేయాలని మహిళా, శిశుసంక్షేమశాఖ కార్యదర్శి దివ్య దేవరాజన్​ను మంత్రి సత్యవతి రాథోడ్​ ఆదేశించారు. అంగన్​వాడీ కేంద్రాలపై నిర్వహించిన సమీక్షలో కీలక సూచనలు చేశారు.

గర్భిణీ స్త్రీల జాబితా ప్రభుత్వానికి ఇవ్వండి

author img

By

Published : Mar 23, 2020, 6:06 PM IST

అంగన్​వాడీ కేంద్రాలపై మంత్రి సత్యవతి రాథోడ్‌ సమీక్ష నిర్వహించారు. అంగన్​వాడీల్లో ఇచ్చే సరుకులను ఇళ్లకే పంపిణీ చేయాలని నిర్ణయించారు. గ్రామ కమిటీల ద్వారా బియ్యం, పప్పు, నూనె, పాలు, గుడ్లు, బాలామృతం పంపిణీ చేయనున్నట్లు తెలిపారు. లబ్ధిదారులకు సెలవురోజుల్లో కూడా సరుకులు పంపిణీ చేయాలని సూచించారు.

గర్భిణీల జాబితా..

గ్రామాలు, పట్టణాల్లోని ప్రసవానికి దగ్గరగా ఉండే గర్భిణీల జాబితా సిద్ధం చేసుకుని, ఈ అత్యవసర సమయంలో వారికి ప్రభుత్వం అందించే అన్ని సేవలు లభించేలా చూడాలని అధికారులను ఆదేశించారు. విదేశాల నుంచి వచ్చే వారి వివరాలు తెలిస్తే వెంటనే ఉన్నతాధికారులకు సమాచారం అందించాలన్నారు.

20 శాతం కంటే తక్కువ..

రోటేషన్ పద్దతిలో.. ఉద్యోగులు 20 శాతం, అంతకన్నా తక్కువ సిబ్బంది విధులు నిర్వర్తించాలని తెలిపారు. శిశువిహార్‌లోని పిల్లల ఆరోగ్య సంరక్షణపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలన్నారు.

గర్భిణీ స్త్రీల జాబితా ప్రభుత్వానికి ఇవ్వండి: సత్యవతి రాథోడ్​

ఇవీ చూడండి: బైకు మీద ఒకరు.. ఫోర్ వీలర్​పై ఇద్దరే: డీజీపీ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.