Maheshbabu team in kurnool: మహేశ్‌బాబు, కీర్తి సురేశ్ జంటగా నటించిన 'సర్కారు వారి పాట' సినిమా విజయోత్సవ వేడుకలను నేడు ఏపీలోని కర్నూలులో ఘనంగా నిర్వహిస్తున్నట్లు మహేశ్‌బాబు అభిమానులు తెలిపారు. ఈ వేడుకల్లో పాల్గొనేందుకు హీరో మహేశ్‌బాబుతోపాటు చిత్ర బృందం కర్నూలుకు వస్తున్నట్లు చెప్పారు.
ఇవాళ సాయంత్రం కర్నూలులోని ఎస్టీబీసీ కళాశాల మైదానంలో ఈ వేడుకలు జరుగుతాయని తెలిపారు. కర్నూలులో సర్కారు వారి పాట సినిమా.. ఒక కోటి ఇరవై లక్షల రూపాయలను నాలుగు రోజుల్లో వసూలు చేసినందున మహేశ్ అభిమానులు కేక్ కట్ చేసి సంబురాలు చేసుకున్నారు.
ఇదీ చదవండి: 'సర్కారు వారి పాట' సక్సెస్ సెలబ్రేషన్స్- '9 అవర్స్' వెబ్ సిరీస్ రిలీజ్
Govt doctors: ప్రైవేటు ప్రాక్టీసుకు వీల్లేదు.. వారికి నిబంధన వర్తింపు